Movie News

ర‌జినీ మీదా నెగెటివ్ ట్రెండా?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ను ఆయ‌న అభిమానులు ఎంత‌గా అభిమానిస్తారో, ఆరాధిస్తారో తెలిసిందే. ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌డ‌మే కాక‌..వివాదాల‌కు దూరంగా ఉంటూ.. సున్నితంగా మాట్లాడే ర‌జినీని ఇత‌ర హీరోల అభిమానులు కూడా ఎంతో గౌర‌విస్తుంటారు. ఆయ‌న్ని నో నెగెటివిటీ స్టార్‌గా చెప్పొచ్చు.

కానీ సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అలాంటి హీరో మీద కూడా అదే ప‌నిగా నెగెటివ్ ట్రెండ్ చేసే ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. సూప‌ర్ స్టార్ తాజాగా వేట్ట‌య‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. జై భీమ్ లాంటి గొప్ప సినిమా తీసిన టీజీ జ్ఞాన‌వేల్ రూపొందించిన చిత్ర‌మిది.

జై భీమ్ త‌ర‌హాలోనే మ‌రోసారి సామాజిక అంశాల‌తో క‌థ‌ను అల్లుకున్నాడు జ్ఞాన‌వేల్. ర‌జినీ కూడా త‌న ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి విభిన్న‌మైన ప్ర‌య‌త్నం చేశాడు. ఐతే సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. కానీ ఇది తీసి ప‌డేయ‌ద‌గ్గ మూవీ అయితే కాదు.

ఐతే సినిమా న‌చ్చ‌క‌పోతే బాలేదు అని చెప్పాలి కానీ.. అదే ప‌నిగా సోష‌ల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేయ‌డం, నెగెటివ్ ట్రెండ్ చేయ‌డమే విడ్డూరం. వేట్ట‌యన్ సినిమా చూసి తాము మాన‌సిక ప్ర‌శాంత‌త కోల్పోయామ‌ని.. టికెట్ డ‌బ్బులు వెన‌క్కి ఇవ్వాల‌ని ఒక రోజంతా నెగెటివ్ ట్రెండ్ చేశారు. Refundvettaiynticketmoney అనే హ్యాష్ ట్యాగ్ నిన్న ఇండియా లెవెల్లో ట్రెండ్ అయింది. ఈ హ్యాష్ ట్యాగ్ మీద దారుణ‌మైన పోస్టులు పెట్టారు.

ర‌జినీని కించ‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. ఇది ప్ర‌స్తుతం త‌మిళంలో నంబ‌ర్ వ‌న్ హీరో అన‌ద‌గ్గ విజ‌య్ అభిమానుల ప‌నే అని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా త‌మిళంలో విజ‌య్ హ‌వా న‌డుస్తోంది. బాక్సాఫీస్ లెక్క‌ల్లో ర‌జినీని విజ‌య్ అధిగ‌మించేశాడు. కానీ ర‌జినీ అభిమానులు ఈ విష‌యాన్ని అంగీక‌రించ‌రు.

వారితో విజ‌య్ అభిమానుల‌కు గొడ‌వ జ‌రుగుతూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే విజ‌య్ ఫ్యాన్స్ ర‌జినీ సినిమా మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ర‌జినీని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఐతే ర‌జినీ లాంటి హీరో మీద కూడా ఇంత నెగెటివిటీ చూపించ‌డం చూస్తే.. సోష‌ల్ మీడియా దుష్ప‌రిణామాలు ఎలాంటివో అర్థ‌మ‌వుతుంది.

This post was last modified on October 16, 2024 3:10 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

46 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

1 hour ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

8 hours ago