టాలీవుడ్ నుంచి కల్కి తర్వాత అత్యధిక అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా సినిమా.. దేవర. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించింది. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా.. ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్లో భారీ వసూళ్లే సాధించింది. ఆ తర్వాత కొంచెం డల్ అయినట్లు కనిపించినా.. దసరా సెలవులను ఉపయోగించుకుని నిలకగా కలెక్షన్లు రాబట్టింది. ఇంకా కూడా ఈ సినిమా రన్ కొనసాగుతోంది. కాకపోతే ప్రస్తుతం వసూళ్లు నామమాత్రంగా ఉన్నాయి.
ఐతే పేరుకు పాన్ ఇండియా సినిమా కానీ దేవర మేజర్ వసూళ్లను తెలుగు వెర్షన్ నుంచే రాబట్టింది. 80 శాతం పైగా వసూళ్లు తెలుగు నుంచి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్‌లో, కర్ణాటకలో తెలుగు వెర్షన్ అదరగొట్టింది. కానీ సౌత్‌లో మిగతా చోట్ల దేవర పెద్దగా ప్రభావం చూపలేదు. తమిళ జనాలు దేవరను అంతగా పట్టించుకోలేదు. అక్కడ వసూళ్లు నామమాత్రం. మలయాళంలోనూ పరిస్థితి అంతంతమాత్రమే.
దేవర తెలుగులో కాకుండా ప్రభావం చూపింది హిందీలో మాత్రమే. అక్కడ ఈ సినిమా హిట్ రేంజిని అందుకుంది. పెద్దగా బజ్ లేకుండా రిలీజైన దేవర హిందీ వెర్షన్‌కు మాస్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. తొలి వీకెండ్లో రూ.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది దేవర. ఆ ఊపు చూస్తే వంద కోట్ల మార్కును కూడా అందుకుంటుందా అనే చర్చ నడిచింది. కానీ దేవర ప్రస్తుతానికి హిందీలో రూ.65 కోట్లే కలెక్ట్ చేయగలిగింది. కానీ ఇది కూడా చిన్న నంబరేమీ కాదు.
విడుదలకు ముందు దేవరకు నార్త్ ఇండియాలో బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ నామమాత్రంగా కనిపించాయి. కానీ తొలి రోజు నుంచి సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది. యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాతో ఈ వసూళ్లు సాధించడం విశేషమే. తెలుగులో దేవర చాలా చోట్ల బయ్యర్లకు లాభాలు అందించింది. కొన్ని ఏరియాల్లో జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్‌గా దేవరకు సంతృప్తికర ఫలితం వచ్చినట్లే.
This post was last modified on October 16, 2024 12:36 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…