తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకోవడం దశాబ్దాల నుంచి చూస్తున్నాం. ఆ సినిమాలకు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సహకారం ఉంటుంది. తమిళ చిత్రాలకు తెలుగులో ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పేరున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వాటిని రిలీజ్ చేస్తారు. ఎగ్జిబిటర్ల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లలో కూడా తమిళ అనువాద చిత్రాలు చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజవుతుంటాయి. వాటికి థియేటర్లు కూడా బాగానే దొరుకుతాయి. కానీ తెలుగు చిత్రాలను తమిళంలో రిలీజ్ చేయాలంటే మాత్రం తంటాలు తప్పవు.
పేరున్న తమిళ సినిమాలు రిలీజ్ కాని టైంలో, తమిళంలోనూ హైప్ ఉన్న చిత్రాలకు మాత్రమే అక్కడ మంచి రిలీజ్ దక్కుతుంటుంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలకు మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు. మిగతా చిత్రాలకు మాత్రం సమస్య తప్పదు.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ను తమిళంలో కొంచెం గట్టిగా రిలీజ్ చేయాలని చూస్తే ఇబ్బందులు తప్పలేదు. కార్తి మూవీ ‘సత్యం సుందరం’కు మెజారిటీ స్క్రీన్లు ఇచ్చి ‘దేవర’కు నామమాత్రంగా థియేటర్లు ఇచ్చారు. సరైన రిలీజ్ దక్కలేదు ఈ చిత్రానికి. దీంతో తమిళంలో చెప్పుకోదగ్గ వసూళ్లూ రాలేదు. తారక్ లాంటి పేరున్న హీరో సినిమాకే అలా ఉంటే వేరే కథానాయకుల చిత్రాల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా కిరణ్ అబ్బవరం తన పాన్ ఇండియా మూవీ ‘క’ను తమిళంలో కూడా రిలీజ్ చేయాలని చూస్తే.. అక్టోబరు 31న ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వమని చెప్పేశారట. ఆ రోజు తమిళంలో ‘అమరన్’ సహా మరో చిత్రమేదో రిలీజవుతోంది. కాబట్టి మినిమం థియేటర్లు కూడా కష్టమని చెప్పేయడంతో వారం తర్వాత తమిళంలో ‘క’ను రిలీజ్ చేద్దామనుకుంటున్నాడు కిరణ్. మరి సంక్రాంతి టైంలో కూడా మనం తమిళ చిత్రాలకు థియేటర్లు ఇస్తాం కదా, మరి మన సినిమాలకు ఇదేం పరిస్థితి అని కిరణ్‌ను అడిగితే.. అది చాలా పెద్ద టాపిక్ అని, దాని గురించి తాను మాట్లాడలేనని అన్నాడు. ఐతే దీపావళికి ‘క’కు తమిళంలో స్క్రీన్లు ఇవ్వట్లేదు కానీ.. మనవాళ్లు మాత్రం ‘అమరన్’కు మంచి రిలీజ్ దక్కేలా చూస్తారనడంలో సందేహం లేదు.
This post was last modified on %s = human-readable time difference 11:28 am
దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…