సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న లైకా వందల కోట్ల బడ్జెట్లను విచ్చలవిడిగా ఖర్చు పెడుతోంది కానీ దానికి తగ్గ ఫలితాలను అందుకోవడం లేదు. ఆ మధ్య కమల్ హాసన్ ఇండియన్ 2 కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. దర్శకుడు శంకర్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలవగా బయ్యర్లకొచ్చిన నష్టాలకు రజనీకాంత్ వేట్టయన్ ని కొంచెం తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది. తీరా చూస్తే సూపర్ స్టార్ కూడా నిరాశపరిచే విధంగానే బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించడం నిర్మాతలను ఖంగారు పెడుతోంది. పోస్టర్ల ద్వారా ఇస్తున్న ప్రకటనల్లో భారీ నెంబర్లు చూపిస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి వేరే ఉందని ట్రేడ్ టాక్.
తమిళంలో పర్వాలేదు కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో వేట్టయన్ చేతులు ఎత్తేస్తాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా వరస ఫ్లాపులు చూస్తున్న లైకాను మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 1, 2 రూపంలో పెద్ద హిట్లు ఇచ్చారు. ఒక తమిళ వెర్షన్ నుంచే పెట్టుబడి మొత్తం రికవర్ అయిపోగా నాన్ థియేట్రికల్ రెవిన్యూ నుంచి వచ్చిన సొమ్ములు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెట్టాయి. ఇవి కమల్ హాసన్, రజనీకాంత్ సంయుక్తంగా కరిగించేశారని చెన్నై వర్గాల గుసగుస. మధ్యలో లాల్ సలామ్ సైతం రజని ఇమేజ్ ని నమ్ముకుని తీసిందే. అది ఎంత దారుణమైన ఫ్లాప్ అంటే కనీసం ఓటిటిలో రాలేదు.
కేవలం స్టార్ పవర్ కలెక్షన్లను తీసుకురాదని మరోసారి రుజువయ్యిందిగా. కంటెంట్ వీక్ గా ఉంటే ఆడియన్స్ ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తారని కళ్లెదుట సాక్ష్యం కనిపిస్తోంది. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్లో అజిత్ విదాముయార్చి నిర్మాణంలో ఉంది. ఇది కూడా ఆగుతూ సాగుతూ ఎప్పుడు విడుదలో అర్థం కానీ అయోమయంలో చిక్కుకుంది. దీనికన్నా చాలా ఆలస్యంగా మైత్రి వాళ్ళు మొదలుపెట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి రిలీజ్ అధికారికంగా ప్రకటించగా లైకా మాత్రం దసరా దీపావళి అంటూ వాయిదా పర్వం కొనసాగిస్తోంది. మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ ( లూసిఫర్ సీక్వెల్) ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on October 16, 2024 11:19 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…