Movie News

అంచనాలకు మించి అఖండ 2 తాండవం

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నాలుగోసారి చేతులు కలిపింది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కలయికలో రూపొందనున్న అఖండ 2 ఇవాళ గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. టీమ్ తో పాటు బాలయ్య ఇద్దరు కూతుళ్లు హాజరవ్వగా వాళ్ళ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. కరోనా మెల్లగా తగ్గుతున్న సమయంతో థియేటర్లలో సరైన సినిమాలు పడక జనం రాని పరిస్థితుల్లో రిలీజైన అఖండ టైటిల్ కు తగ్గట్టే అఖండ విజయం సాధించి రికార్డుల బూజు దులిపి అద్భుత విజయం సాధించింది.

దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. వాళ్ళ ఆకాంక్ష ఫలించింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అఖండ 2లో పలు ఆసక్తికరమైన విశేషాలున్నాయి. మొదటి భాగం లాగే పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ ని కొనసాగిస్తూనే ఈసారి కొత్తగా డివోషనల్ టచ్ ని కమర్షియల్ గా చూపించబోతున్నట్టు తెలిసింది. అఖండలో ఇంటర్వెల్ తర్వాతే ఈ అంశాలు ఉంటాయి. కానీ అఖండ 2 తాండవంలో పేర్లు పడటం దగ్గరి నుంచే అఘోరాగా బాలయ్య మాస్ ని చూడొచ్చని అంటున్నారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడికి సంబంధించిన కొన్ని కీలక ఎపిసోడ్లు ఉంటాయని తెలిసింది.

సింహ, లెజెండ్, అఖండ తర్వాత రిపీటవుతున్న కలయిక కావడంతో ప్రకటన దశ నుంచే దీని మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ భారీ బడ్జెట్ కేటాయించబోతోంది. క్యాస్టింగ్ దాదాపు అదే కొనసాగనుంది. కొత్తగా తోడయ్యే వాళ్ళను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈసారి తమన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సరికొత్త సౌండింగ్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అఖండని నిలబెట్టిన ఈ సంగీత సంచలనం ఈసారి అంతకు మించి ఇస్తాడనే నమ్మకంతో మ్యూజిక్ లవర్స్ లో ఉంది. ఎన్బికె 109 సంక్రాంతికి విడుదల కానుండగా అఖండ 2 తాండవం కూడా వచ్చే ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on October 16, 2024 11:16 am

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

1 hour ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

2 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

3 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

4 hours ago