ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ సమస్య మరింత దారుణంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మనం తీసుకునే జంక్ ఫుడ్స్, మన బిజీ లైఫ్ స్టైల్. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగినప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీకు తరచుగా కీళ్ల నొప్పులు, కాళ్లు చేతులు వాయడం, పడుకొని నిద్రలేచినప్పుడు ఒళ్లంతా నొప్పిగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా ఒకసారి యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోండి.
అలాగే ఇంట్లో చేసుకునే ఒక చిన్న డ్రింక్ తో మనం లైఫ్ లో యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది సహజ సిద్ధమైనది కాబట్టి మన శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఈ డ్రింక్ రోజు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. యూరిక్ యాసిడ్ సమస్యతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలను, ఊబకాయాన్ని కూడా అరికట్టడంలో ఈ న్యాచురల్ డ్రింక్ ఎంతో హెల్ప్ చేస్తుంది.
సాధారణంగా మన శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగినప్పుడు కీళ్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలా వచ్చే వాటిలో గౌట్, ఆర్థరైటిస్ ముఖ్యమైనవి. కొందరికి ఈ సమస్య వల్ల కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ మోతాదులో ఉత్పన్నం అవ్వడం కామన్ అయిపోయింది.
ఇక ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సిందల్లా కాస్త జీలకర్ర ,నిమ్మ చెక్క. జీలకర్ర తీసుకోవడం వల్ల మన శరీరంలో అతిగా ఉత్పన్నమయ్యే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. దీనికోసం ముందు రోజు ఒక గ్లాసు నీటిలో కాస్త జీలకర్ర వేసి నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే ఈ నీళ్లను బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక వడకట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కాస్త నిమ్మ చెక్క పిండి రుచికి తగినట్టుగా కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది.
ఈ డ్రింక్ రోజు పరగడుపున తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గడంతో పాటు వీరణ సంబంధిత సమస్యలు, ఎసిడిటీ వంటివి తగ్గిపోతాయి. జీలకర్ర డైజెషన్ ని పెంచడంతోపాటు శరీరం నుంచి మలినాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ మిరాకిల్ డ్రింక్ ఇంటి వద్ద చేసుకుని తాగడానికి ప్రయత్నించండి.
గమనిక: పైన అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా న్యూట్రిషన్ ని సంప్రదించడం మంచిది.
This post was last modified on December 23, 2024 9:52 pm
రాజకీయ ప్రవేశం చేశాక తన చివరి సినిమాగా విజయ్ చేస్తున్న తలపతి 69కి 'జన నాయగన్' టైటిల్ ని ఖరారు…
భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20…
ధమాకా తర్వాత రవితేజ రియల్ మాస్ మళ్ళీ తెరమీద కనిపించలేదు. వాల్తేరు వీరయ్య సంతృప్తి పరిచింది కానీ అది చిరంజీవి…
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే... ఏదో…
దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు.…
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని…