Bhakti

ధర్మాన్ని పాటిస్తే సమాజ శాంతి

ఎవరి వృత్తి పనిలో వారు ధర్మబద్ధంగా ఉంటే సమాజం లో శాంతి నెలకొంటుందని సీబీఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ వీ.వీ లక్ష్మీ నారాయణ అన్నారు. నేడు ప్రతిరోజు నేర పూరిత వార్తలుతో దిన పత్రికలు నిండుతున్నాయని ఇందుకు కారణం జాతి తన ధర్మాన్ని కోల్పోతున్న సందర్భం అన్నారు.

హైదరాబాద్, చిక్కడపల్లి లోని త్యాగరాయ గాన సభలో మంగళవారం ఉదయం ‘భగవద్గీతా ఫౌండేషన్’ నిర్వహణ ‘గీతాజయంతి మహోత్సవం’ వేడుక ఆద్యంతం గీతా బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. గీత స్మరణతో ఆడిటోరియం పులకించింది.

ఈ వేడుక లో ముఖ్య అతిధిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ భారతీయ జీవన విధానం ఆధ్యాత్మికత, శాంతి, సహనం వీటికి దూర మవుతున్న కొద్దీ సమాజంలో అలజడి అసహనం ఎక్కువ అవుతుందన్నారు గీత మార్గనిర్దేశనం చేస్తుందని వివరించారు.

వేదిక పై అతిధులు అందరూ సంయుక్తంగా ప్రపంచపు తొలి ఆంగ్ల సంగీత భరిత భగవద్గీత ఆడియో పోస్టర్ ను ఆవిష్కరించారు

గోవింద పీఠం పీఠాధిపతి పూజ్య శ్రీ శ్రీరామ ప్రియ స్వామి మాట్లాడుతూ అధికారులు,నాయకులు, స్వామీజీ లు ప్రోటోకాల్ తో జన సామాన్యానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భగవద్గీత ఎవరి కర్తవ్యాన్ని వారు పాటించాలని సందేశాన్ని ఇచ్చిందని, గంగాధర్ శాస్త్రి మనసా వాచా కర్మణా గీత సారాన్ని పాటిస్తూ ప్రచారం చేస్తున్నారని అభినందించారు.

గాన సభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి మాట్లాడుతూ సినీ జర్నలిస్ట్ గా అపర ఘంటసాలగా ఒకనాడు పేరు గడించిన గంగాధర్ శాస్త్రి గీత ఫౌండేషన్ స్థాపించి జీవితమంతా గీతాప్రచారం కు అంకితంకావటం విశేషమన్నారు. ఈ సందర్భంగా వై.రామకృష్ణ కు గీతాచార్య పురస్కారం, చి|| జి.నాగఅనిష్కకు పార్ధ పురస్కారం, చి|| కలగ అచ్యుతశర్మ కు గీత బాల మేధావి పురస్కారం అతిధులు బహుకరించారు.

అనంతరం భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కృష్ణ భజన, గీతామృతంను మధుర గళంతో గానం చేస్తూ స్ఫూర్తి వంతగా వ్యాఖ్యానం చేసి శ్రోతలను ఆకట్టుకున్నారు,గీతా సందేశం ను అందించారు. కార్యక్రమానికి ముందు త్యాగరాయ గానసభ ఆవరణలో గోపూజ నిర్వహించారు. శ్రీమతి క్రాంతి నారాయణ్ ప్రదర్శించిన శ్రీకృష్ణ నృత్యం ఆహుతులను అలరించింది.

This post was last modified on December 14, 2021 8:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ మాటల్లో టాలీవుడ్ గొప్పదనం!

మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…

54 minutes ago

జ‌న‌సేనాని దూకుడు.. కేంద్రం ఫిదా!

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…

1 hour ago

బాబు పాల‌న‌కు.. జ‌పాన్ నేత‌ల మార్కులు!!

ఏపీలో తాజాగా జ‌పాన్‌లో టాయామా ప్రిఫెడ్జ‌ర్ ప్రావిన్స్ గ‌వ‌ర్న‌ర్ స‌హా 14 మంది ప్ర‌త్యేక అధికారులు.. అక్క‌డి అధికార పార్టీ…

1 hour ago

ఇదెక్కడి బ్యాడ్ లక్ సామీ.. 2 పిజ్జాల కోసం రూ.8వేల కోట్లా…

రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…

1 hour ago

సజ్జ‌లతోనే అస‌లు తంటా.. తేల్చేసిన పులివెందుల‌!

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ .. సొంత నియోజక‌వ‌ర్గం పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు.…

2 hours ago

డిసెంబర్ 30 : ఆడబోయే ‘గేమ్’ చాలా కీలకం!

మెగాభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకో 15 రోజులు మాత్రమే టైముంది. ప్రమోషన్లు రెగ్యులర్…

2 hours ago