సీబీఐ తో కేసీఆర్ సర్కార్ కి రేవంత్ రెడ్డి షాక్..!

కేసీఆర్ సర్కార్ ని ఇరకాటంలో పెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. కేసీఆర్ సర్కార్ పై సీబీఐ కి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని…ఈ కుంభకోణం పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తన ఫిర్యాదు లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కుంభకోణా ల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదు పేర్కొన్న రేవంత్‌ రెడ్డి. కెసిఆర్ సన్నిహితులు ఉన్నతాధికారులు భూములు దక్కించుకున్నారని ఆరోపణలు చేశారు. అధికార బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్‌ చేశారు

ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్స్ కోరానని రేవంత్ రెడ్డి తెలిపిారు. సీఎం కేసిఆర్ అవినీతి పై చర్యలు తీసుకోవడం లో అధికార బిజెపి పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని ఆయన సవాల్‌ విసిరారు. కాగా… ఇటీవలే… ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు… కోకాపేట భూములను తెలంగాణ సర్కార్‌ అమ్మిన సంగతి తెలిసిందే.