NTR కథలో రాజగురువు ఎవరు?

NTR కథలో రాజగురువు ఎవరు?

విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథతో ఆయన తనయుడు బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ సినిమాపై ఇటు సినిమా జనాలే.. అటు రాజకీయ నేతలూ ఆసక్తిగానే ఉన్నారు. ఎన్టీఆర్ నటుడిగా తెలుగు ప్రజల ఎంతటి చిరస్థానం సంపాదించుకున్నాడో రాజకీయ నాయకుడిగా అదేస్థాయిలో ప్రజల అభిమానం సంపాదించుకున్నాడు.

పార్టీ పెట్టిన నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న అత్యంత అరుదైన ఘనత ఎన్టీఆర్ ది. ఈ విజయం వెనుక ఎన్టీఆర్ ప్రజాకర్షణతో పాటు మీడియా మొఘల్.. రాజకీయాల్లో రాజగురువుగా పేరొందిన రామోజీరావు పాత్ర చాలానే ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ ఉంటూనే వచ్చింది. ఈమధ్య రామోజీరావు షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టి సినిమాకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకుని వెళ్లారు. దీనిని బట్టి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన పాత్ర ఉంటుందనే అనుకోవచ్చు. అయితే పాత్రను ఏ రేంజిలో చూపించబోతున్నారనే దానిపై అంతటా ఆసక్తి ఉంది.

ఎన్టీఆర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు పేరొందిన... టాలెంటెడ్ నటులను తీసుకుంటూ బయోపిక్ పై ఆసక్తి పెంచుతున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీకి కథ స్రీన్ ప్లే అంతా రామోజీరావుదే.  వెండితెరపై ఈ పాత్ర ఎవరు పోషిస్తున్నారు.. అందుకు తగ్గ నటుడు ఎవరని డైరెక్టర్ క్రిష్ ఫీలవుతున్నాడు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. అది తెలియాలంటే ఇంకొిద్ది రోజులు ఆగాల్సిందే.



 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు