సూర్య సినిమా 200 దేశాల్లో

తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తాను హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘సూరారై పొట్రు’ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడానికి అతను ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

దక్షిణాదిన ఇలా నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న తొలి భారీ చిత్రం ఇదే. తమిళ సినీ పరిశ్రమలోనే కాదు.. సౌత్ ఇండియాలో ఇదో సంచలనంగా మారింది. తమిళ ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా సరే.. సూర్య తగ్గట్లేదు.

ఈ చిత్రానికి అమేజాన్ వాళ్లు రూ.60 కోట్ల రేటు పెట్టినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అది మరీ పెద్ద మొత్తం కదా.. అంతగా వాళ్లకు ఈ సినిమా ఏం ప్రయోజనం తెచ్చిపెడుతుంది అని సందేహించే వాళ్లూ లేకపోలేదు. కానీ సూర్య సినిమా కోసం లక్షల్లో కొత్త సబ్‌స్క్రిప్షన్లు వస్తాయనడంలో సందేహం లేదు. కచ్చితంగా ఈ యాప్‌కు ఆదరణ పెంచే సినిమా ఇది.

ఇక సూర్య సత్తా ఏంటో బాగా తెలిసే అమేజాన్ వాళ్లు ఈ సినిమాను కొన్నట్లు తెలుస్తోంది. ఏకంగా 200 దేశాల్లో ఈ సినిమాను ప్రైమ్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు అమేజాన్ ప్రకటించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సూర్యకు పాపులారిటీ ఉందని.. యాప్‌లో దీన్ని బాగా ప్రమోట్ చేస్తే ఎన్నో కోట్ల కొత్త ప్రేక్షకులకు ఇది రీచ్ అవుతుందని భావిస్తున్నట్లుంది. 200 దేశాల్లో విడుదల అంటే దీన్నో హాలీవుడ్ సినిమా లాగా ప్రమోట్ చేస్తారన్నమాట.

మామూలుగా ప్రాంతీయ సినిమాలను ఇలా ఇన్ని దేశాల్లో అందుబాటులోకి తేవడం, ఆ దిశగా ప్రమోట్ చేయడం జరగదు. కానీ సూర్య సినిమా అందుకు మినహాయింపు. రెండు నెలల ముందే రిలీజ్ డేట్ ప్రకటించారంటే.. మధ్యలో ఆన్ లైన్లో గట్టిగా ప్రమోట్ చేస్తారన్నమాట. తెలుగమ్మాయి సుధ కొంగర ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించింది. ఎయిర్ ద‌క్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు గోపీనాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.