జూనియర్ రిస్క్ తీసుకుంటున్నాడేమో!

June 5th, 2013, 07:13 AM IST
జూనియర్ రిస్క్ తీసుకుంటున్నాడేమో!

బాద్ షా అంత పెద్ద హిట్ కాకపోయినా పెద్దగా బాధ పడినట్టు లేడు జూనియర్. దాన్ని పక్కన పెట్టేసి తర్వాతి ప్రాజెక్టులు చూసుకోవడంలో మునిగిపోయాడు. రామయ్యా వస్తావయ్యాతో పాటు మరికొన్ని సినిమాల్లో మునిగి తేలుతున్నాడు. అయితే అతడు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద తలకాయలు చెప్పుకుని నవ్వుకుంటున్నాయి. దానికి కారణం వక్కంతం వంశీ. అప్పట్లో టీవీలో యాంకర్ గా న్యూస్ రీడర్ గా సందడి చేసిన ఈయనగారు, ఓ సినిమాలో హీరోగా కూడా మెరిశాడు. కానీ నటన అచ్చిరాదని అర్థమై కథకుడి అవతారమెత్తాడు. మెల్లగా పెద్ద హీరోల సినిమాలకు కథలు అందించే స్థాయికి చేరాడు.

అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే, భయంకరమైన డిజాస్టర్లు ఈయన ఖాతాలో చాలానే ఉన్నాయి. జూనియర్ ఎన్టీయార్ కు కూడా ఘోర పరాజయాన్ని చవిచూపించాయి ఈయన కథలు. అయినా అదేంటో కానీ, ఈ మధ్య వంశీని పిలిచి 'నిన్ను దర్శకుడిని చేస్తాను, ఓ మంచి కథ తయారు చేసుకో' అని చెప్పాడట యంగ్ టైగర్. ఇది విని షాకయిన సన్నిహితులు నిలదీస్తే... 'అతన్ని డైరెక్టర్ ని చేస్తానని మాటిచ్చాను, నా మాట నిలబెట్టుకుంటాను' అన్నాడట. తన మాట నిలబెట్టుకుంటాడు సరే. తర్వాత ఏదైనా తేడా వస్తే తను నిలబడగలగాలి కదా! ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా

TAGS : Jr NTR,Vakkantham Vamsi,Rammaya Vasthavyia
 

Related News

ప‌వ‌న్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు!

ప‌వ‌ర్‌స్టార్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తాడా లేక రాజ‌కీయాల‌కే ...

అమ‌ల ముహూర్తం పెట్టేసింది!

కేర‌ళ కుట్టి అమ‌లాపాల్ పెళ్లి పీట‌లెక్కబోతోంది. త‌మిళ ద‌ర్శకుడు ...

చంద్రబాబు - యుద్ధ వ్యూహాలు

ఎన్నికలు అంటే యుద్ధమే. ప్రత్యర్థులపై పై చేయి కావడానికి ఎన్ని వ్యూహాలు ...

జగన్ మదిలో పొత్తు ఆలోచనలు?

ఒక్కోసారి అనుకోకుండా మనసులో మాట ఏదోలా బయటకు వచ్చేస్తుంటుంది. వైఎస్ఆర్ ...

మెగా హీరోలని వదిలేసాడేంటి?

 వైవిఎస్‌ చౌదరి మూడేళ్లుగా రేయ్‌ సినిమా మీదే తన దృష్టి మొత్తం పెట్టిన ...

-