మా అబ్బాయి చాలా మంచోడుః ర‌వితేజ త‌ల్లి

మా అబ్బాయి చాలా మంచోడుః ర‌వితేజ త‌ల్లి

టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్ర‌గ్స్ రాకెట్ లో పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన సినీ ప్రముఖులు త‌మ త‌మ వివర‌ణలు ఆల్రెడీ ఇచ్చేశారు. ఈ నోటీసుల వ్య‌వ‌హారంలో హీరో ర‌వితేజ పేరు ఉంద‌ని కొన్ని చానెళ్ల‌లో వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ‌కు నోటీసులు ఇచ్చిన‌ట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ధ్రువీకరించలేదు. అయితే, ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు ర‌వితేజ కానీ, ఆయ‌న త‌ర‌పున వ్య‌క్తులు కానీ స్పందించ‌లేదు. ఈ  నేప‌థ్యంలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై ర‌వితేజ‌ త‌ల్లి రాజ్య‌ల‌క్ష్మి స్పందించారు.

రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవని, ఈ డ్ర‌గ్స్ కేసులో ర‌వితేజ‌కు ఎటువంటి సంబంధం లేదని రాజ్యలక్ష్మి తెలిపారు. డ్ర‌గ్స్‌ కేసులో రవితేజ పేరు బయటకు రావడం తనకు బాధ కలింగించింద‌న్నారు. తన కొడుకు సిగరెట్‌ తాగడని, తాగేవాళ్లను ప్రోత్సహించడని ఆమె చెప్పారు. కావాలనే ర‌వితేజ‌ను ఈ కేసులో అతడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు.

చనిపోయే కొద్ది రోజుల ముందు భరత్‌ అన్ని దురలవాట్లు మానేశాడని రాజ్య‌ల‌క్ష్మి వెల్లడించారు. మద్యం సేవించి డ్రైవ్ చేయ‌డం వ‌ల్లే భరత్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కుటుంబ ఆచారం ప్రకారమే భరత్‌ అంత్యక్రియలకు హాజరుకాలేదన్నారు. నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశంతోనే రవితేజ షూటింగ్‌కు వెళ్లాడని చెప్పారు. భరత్ ను రవితేజను ఒకే గాట‌న క‌ట్ట‌వ‌ద్ద‌ని ఆమె అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు