తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 కుబేరుల కుటుంబాలు

డాక్టర్ రెడ్డీస్ సతీష్ రెడ్డి..మైహోమ్ జూపల్లి రామేశ్వర్.. హెటెరో పార్థసారథి.. నవయుగ విశ్వేశ్వరరావు.. ఈనాడు రామోజీ.. అపర్ణ కన్ స్ట్రక్షన్స్ వెంకటేశ్వరరెడ్డి.. విజయ్ ఎలక్ట్రికల్స్ దాసరి జై రమేశ్.. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటే పోతే.. తెలుగు నేల మీద నిత్యం పలువురి మాటల్లో వినిపించే పేర్లు ఇవి. ఈ ప్రముఖల ఆస్తుల విలువ ఎంతన్నంతనే ఎవరికి తోచింది వారు చెబుతుంటారు. అందుకు భిన్నంగా ఎవరి ఆస్తి ఎంత అన్న విషయంపై క్లారిటీ వస్తే ఎంతో బాగుంటుంది కదా?

తాజాగా అలాంటి అవకాశమే వచ్చింది. ప్రతి ఏటా దేశీయంగా సంపన్నులు.. వారి కుటుంబాల ఆస్తుల లెక్కల్ని మదింపు చేసి జాబితాను విడుదల చేసే హురున్ రిచ్ లిస్టు లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కుబేరుల ఆస్తుల లెక్కలు బయటకు వచ్చాయి. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 62 మంది చోటు దక్కించుకోగా.. వారిలో టాప్ 20 ఆస్తుల వివరాలు ఏమిటన్న విషయంపై క్లారిటీ రాక మానదు.

అపర కుబేరులు.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల పేర్లు.. వారి సంపద ఎంతన్న విషయంపై వివరాలు బయటకు వచ్చాయి. టాప్ టెన్ సంపన్నులతోపాటు.. ఈ ఏడాది కొత్తగా లిస్టులోకి వచ్చి చేరిన ప్రముఖుల్లో టాప్ టెన్ సంపన్నుల్ని చూస్తే..

పేరు-ఫ్యామిలీ కంపెనీ సంపద విలువ (కోట్లల్లో)
మురళీ దివి దివిస్ ల్యాబ్స్.  49,200
బి పార్థసారథి హెటెరో డ్రగ్స్ 13,900
కె. సతీశ్ రెడ్డి డాక్టర్ రెడ్డీస్ 11,200
పి. పిచ్చిరెడ్డి ఎంఈఐఎల్ 11,100
పి.వి. క్రిష్ణరెడ్డి ఎంఈఐఎల్ 10,700
జి.వి.ప్రసాద్..అనురాధ డాక్టర్ రెడ్డీస్ 9,400
జూపల్లి రామేశ్వర్ రావు మైహోం 8,900
ఎం సత్యనారాయణరెడ్డి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 8,700
వి.సి. నన్నపనేని నాట్కో ఫార్మా 7,500
సి. విశ్వేశ్వర రావు నవయుగ 4,900