పదవి నాకు అలంకారం కాదు బాధ్యత !

పదవి నాకు అలంకారం కాదు. బాధ్యత. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. వైసీపీ హయాంలో గ్రామాలలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.  ఏపీలోని 75 శాతం గ్రామ పంచాయతీలలో వైసీపీకి చెందిన వారే సర్పంచ్ లుగా ఉన్నారని,  గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన అన్నారు.