హైదరాబాద్‌లోని విద్యార్థులకు, బుల్లితెర నటీనటులకు సహా.. కొందరికి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి(32)ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న మస్తాన్.. గుంటూరులో డ్రగ్స్ డెన్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. ఆయన కోసం కొన్నాళ్లుగా వెతుకుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వెలుగు చూసి.. తీవ్ర దుమారం రేపిన నటుడు రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారంలోనూ మస్తాన్ పేరు వినిపించింది. లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసింది మస్తానేనని పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున యువతులతో పోర్న్ వీడియోలు తీయిస్తున్నట్టు కూడా గుర్తించారు.
అంతేకాదు.. లావణ్య-మస్తాన్‌లు సహజీవనం చేసినట్టు కూడా ఆరోపణలు వెలుగు చూశాయి. అయితే అప్పట్నుంచి మస్తాన్ కనిపించకుండా పోవడంతో హైదరాబాద్ పోలీసులు అతనిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గుంటూరులోని ఓ దర్గాలో ఉన్నట్టు గుర్తించి తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఆయన ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని డ్రగ్స్‌కు సంబంధించిన కూపీ లాగుతున్నారు. ఇతని ఫోన్‌లో వందల మంది అమ్మాయి ల ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు గుర్తింంచారు. పలువురు అమ్మాయిలను నగ్నంగా వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది.
భారీ బిజినెస్
మద్యంతోపాటు.. పోర్న్ వీడియోల వ్యాపారం కూడా మస్తాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణకు చెందిన యువతులను టార్గెట్ చేసుకుని, వారి బలహీనతలను గుర్తించి.. సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. సిని మా అవకాశాలు ఇప్పిస్తానంటూ.. యువతులను లొంగదీసుకుని పోర్న్ వీడియోలు చేయించిన ఘటనలు, వారిని డ్రగ్స్ ఊబిలోకి లాగిన ఘటనలు కూడా ఉన్నాయని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే లావణ్య కూడా మస్తాన్ వలలో చిక్కినట్టు తెలుస్తోంది. ఇక, డ్రగ్స్ వ్యాపారంలో మూడుపువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా మస్తాన్ దూసుకుపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిని అరెస్టు చేయడం ద్వారా.. ఒక పెద్ద సవాల్‌కు చెక్ పెట్టినట్టు అయిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on August 12, 2024 10:30 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…