కనీ వినీ ఎరుగని రీతిలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా భారత మార్కెట్లు దారుణ పరిస్థితులను చవి చూస్తున్నాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభం అవుతూనే.. నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ నుంచి నిఫ్టీ వరకు.. బీఎస్ఈలో నమోదైన అన్ని సంస్థలు కూడా మార్కెట్‌లో నష్టాలు చవి చూస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద తుడిచి పెట్టుకుపోయింది.
ప్రఖ్యాత కంపెనీలు కూడా..
ప్రఖ్యాత కంపెనీలైన టాటా మోటార్స్, స్టీల్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, మారుతి, మహింద్రా, ఎస్‌బీఐ సహా.. ఇతర బ్రాండ్లు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. వీటిలో అదానీకి చెందిన పోర్ట్స్ కూడా తొలి సారి నష్టాల్లో కనిపించడం గమనార్హం. ఇక, అంబానీకి చెందిన రిలయన్స్‌కూడా.. 3.3 శాతం షేర్లు భారీ నష్టాల్లో ఉంది. ఇక, టాటా స్టీల్ 3.5 శాతం, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ 3.3 శాతం నష్టాలలో కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున కుంగిపోయిందనే చెప్పాలి.
ఎందుకిలా?
అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లు, ప్రపంచ యుద్ధం ముప్పు వంటివి స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపు తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు అమెరికాలో ఎన్నికలు, ఆర్థిక మాంద్యం, చైనాలో నిరుద్యోగం తీవ్రత వంటివి కూడా ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. అలానే పెరుగుతున్న వడ్డీ రేట్లు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ తమ వడ్డీ రేట్లను పావలా చొప్పున పెంచింది. అలాగే బాండ్ల కొనుగోళ్లను దాదాపు నిలిపి వేసింది.
దీంతో జపాన్ కరెన్సీ ‘యెన్’ బలపడింది. దీంతో నష్టాల నుంచి బయట పడేందుకు పెట్టుబడి దారులు తమ వాటాలను అమ్మేయడం ప్రారంభించారు. దీంతో ‘టెక్ స్టాక్స్’లో అమ్మకాలు జోరందుకున్నాయి. దీని ప్రభావం ఆసియా దేశాలు సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపిస్తోంది. భారత్‌పై మరింత ప్రభావం చూపిస్తోంది. ఎలా చూసుకున్నా.. 14 లక్షల కోట్ల సంపద అయితే ఆవిరై పోయింది. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం సంపద ఆవిరి కావడం గమనార్హం.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…