Trends

ఒలింపిక్స్‌లో ఓ సంచలన ఘటన

పారిస్‌లో ఒలింపిక్స్ ఉత్సాహభరితంగా జరుగుతున్న వేళ ఒక ఉదంతం సంచలనం రేపుతోంది. ఇటలీ బాక్సర్ యాంజెలా ఉన్నట్లుండి బౌట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలిఫ్‌తో బౌట్‌ మొదలైన 40 సెకండ్లకే యాంజెలా రింగ్ నుంచి నిష్క్రమించింది. అలా అని ఆమె నేమీ ఖెలిఫ్ నాకౌట్ చేయలేదు. గట్టి దెబ్బ తగిలి కోలుకోలేని స్థితిలో ఉంటే బాక్సర్లు నాకౌట్ అయి నిష్క్రమిస్తారు. కానీ ఇక్కడ అలా ఏమీ జరగలేదు.

ఖెలిఫ్ నుంచి యాంజెలా రెండు గట్టి పంచ్‌లు తిన్న మాట వాస్తవమే. ఒక పంచ్‌కు ఆమె ముక్కు పగిలి రక్తం వచ్చింది. అలా అని యాంజెలా బౌట్‌లో కొనసాగలేని స్థితిలో లేదు. అయినా నేనీ బౌట్ ఆడను అంటూ ఆమె వైదొలిగింది. ఇందుకు కారణం ఏంటి అని ఆమె వెల్లడించకపోయినా.. కన్నీళ్లతో ఆమె నిష్క్రమించిన తీరును బట్టి అందరికీ విషయం అర్థమైపోయింది.

ఖెలిఫ్‌లో పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనే విషయం గతంలో వెల్లడైంది. గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ సమయంలో ఖెలిఫ్‌కు పరీక్షలు నిర్వహించగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తేలడంతో ఆమెను పోటీల నుంచి నిష్క్రమించారు. ఐతే ఒలింపిక్స్‌కు ఆ రూల్స్ వర్తించవు. టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా.. మహిళ మహిళే అనే ఉద్దేశంతో ఇలాంటి వారిని పోటీలకు అనుమతిస్తున్నారు. కానీ కండలు తిరిగిన ఖెలిఫ్ ఫిజిక్, తన లాంగ్వేజ్ చూస్తే అబ్బాయిలాగే కనిపిస్తుంది.

ఖెలిఫ్ ఇచ్చిన పంచ్‌ గురించి యాంజెలా మాట్లాడుతూ.. ఇంత బలమైన పంచ్ తన జీవితంలో ఎదుర్కోలేదని పేర్కొంది. అమ్మాయిలకు ఇలాంటి పంచ్ సాధ్యం కాదన్న రీతిలో ఆమె మాట్లాడింది. ఆమె ఖెలిఫ్ మీద నేరుగా ఆరోపణలు చేయకపోయినా, తాను వైదొలగడానికి ఆమెలో పురుష లక్షణాలు ఎక్కువ ఉండడమే కారణం అని చెప్పకపోయినా.. ప్రపంచం మాత్రం ఆ రకంగానే విషయాన్ని అర్థం చేసుకుంది. ‘ఎక్స్’ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సహా చాలామంది.. మహిళల ఈవెంట్లో పురుషులను ఎలా ఆడిస్తారంటూ ప్రశ్నించారు. యాంజెలా-ఖెలిఫ్ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేసింది. నిన్నట్నుంచి ఒలింపిక్స్‌కు సంబంధించి మిగతా విషయాలకంటే ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తైవాన్‌కు చెందిన లిన్ యు టింగ్ సైతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటోంది.

This post was last modified on August 2, 2024 2:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

15 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

3 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

4 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

4 hours ago