క్యారెక్టర్ నటుడిగా మొదలుపెట్టి.. హీరోగా స్థిరపడ్డ యువ నటుడు శ్రీ విష్ణు. డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో అతను ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు. మధ్యలో కొన్ని ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగాయి. కానీ గత ఏడాది ‘సామజవరగమన’తో మళ్లీ పెద్ద హిట్ కొట్టి ఫామ్ అందుకున్నాడు. ఈ ఏడాది శ్రీ విష్ణు నుంచి వచ్చిన ‘ఓం భీం బుష్’ కూడా బాగానే ఆడింది.
ఇప్పుడు అతను చేస్తున్న చిత్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది.. స్వాగ్. శ్రీ విష్ణుతో ‘రాజ రాజ చోర’ తీసిన హాసిత్ గోలి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోలన్నీ క్రేజీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నిన్నటితరం మలయాళ నటి మీరా జాస్మిన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవలే వెల్లడించారు.
కాగా ‘స్వాగ్’లో శ్రీ విష్ణు పాత్ర గురించి ఇప్పుడో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఇందులో శ్రీ విష్ణు రకరకాల గెటప్పుల్లో కనిపిస్తున్నాడట. ఆ గెటప్‌లు దాదాపు 15 ఉంటాయని సమాచారం. అందులో హిజ్రా అవతారంలోనూ కనిపిస్తాడట శ్రీ విష్ణు.
‘రాజ రాజ చోర’లో దొంగగా విభిన్న అవతారాల్లో కనిపిస్తాడు శ్రీ విష్ణు. ఇది కూడా అలాంటి సినిమానే అంటున్నారు. బహుశా ఇందులోనూ అతను దొంగగా కనిపిస్తాడేమో. ఆ క్రమంలో అవతారాలు మారుస్తాడేమో. ఒకప్పుడు స్టార్ హీరోలు హిజ్రా తరహా వేషాల్లో కనిపించాలంటే భయపడేవాళ్లు. ఇమేజ్ అడ్డొచ్చేది. ఫ్యాన్స్ కూడా ఒప్పుకునేవారు కాదు.
కానీ ఇప్పుడు అందరి ఆలోచన ధోరణి మారిపోయింది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోనే ‘పుష్ప’లో ఆడవేషం వేశాడు. దీంతో చిన్న హీరోలు ఎలాంటి శషబిషలు పెట్టుకోకుండా ఇలాంటి గెటప్పుల్లో కనిపించడానికి ముందుకొస్తున్నారు.
This post was last modified on June 3, 2024 4:47 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…