కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనం తెరమీదికి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి ఇక్కడి ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలిసింది. దీనిని స్థానిక సీసీబీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. ఈ పార్టీలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని నటి.. హేమ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే.. ఆమె దీనిని ఖండించారు. తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తననుఅనవసరంగా ఈ రొచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
అంతేకాదు.. తాను ఆదివారం హైదరాబాద్‌లోనే ఉన్నానని.. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని హేమ వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తన అభిమానులు ఎవరూ నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియా కూడా.. నియంత్రణ పాటించాలన్నారు. ఇక, ఈ పార్టీలో మరో కీలక అంశం.. వైసీపీ మంత్రి కారు పట్టబడడం. వైసీపీ కీలక నాయకుడు, సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి స్టిక్కర్‌తో ఉన్న కారును రేవ్‌పార్టీని కట్టడి చేసేందుకు వచ్చిన పోలీసులు గుర్తించారు.
ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పలువురు తారలు, ప్రముఖుల కార్లను కూడా.. పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. రేవ్‌పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు గుర్తించారు. ఆదిశగానే ఇప్పుడు విచారణ చేపట్టారు. ఇక, ఒక ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజును పురస్కరించుకుని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న జీఆర్ ఫామ్ హౌస్‌లో ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్న తెలిపారు. కాగా.. ఈ పార్టీకి వచ్చిన వారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు గుర్తించారు.
This post was last modified on May 20, 2024 3:34 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…