బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముకేశ్ కుమార్(28) బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడ్డాడు. బెట్టింగ్‌లో ముకేశ్ ఇప్పటివరకు రూ.2 కోట్లు పోగొట్టాడు.
ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై కుమారుడు మృతి చెందాడు. ముకేశ్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్ కారణంగా అమ్మేశాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో బెట్టింగ్ యాప్ ల కారణంగా యువత తమ ప్రాణాలను కోల్పోతున్నది. అనేక మంది యువత వీటి బారినపడి ఆస్తులతో పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నది.
This post was last modified on May 12, 2024 5:25 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…