కొన్ని ఘటనలు అనూహ్యంగా ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని పలు వైరల్ వీడియోలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న పెళ్లి కుమార్తె.. అనుకున్న ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకోవటానికి ఆమె తీసుకున్న నిర్ణయం చిట్టి వీడియోలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో పెళ్లి కుమార్తె తెలివికి.. స్మార్ట్ నెస్ కు అభినందనలు వెల్లువెత్తుతుంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం మరోసారి చర్చకు రావటమే కాదు.. ఈ ఉద్యాన నగరి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారింది.
మరికాసేపట్లో పెళ్లి చేసుకునేందుకు అందంగా ముస్తాబైన పెళ్లి కుమార్తె బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారులో వెళితే.. కచ్ఛితంగా ఆమె పెళ్లి ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకునే అవకాశం లేదు. దీంతో.. ఏం చేయాలన్న ఆందోళనతో ఇంట్లోని వారు ఉంటే.. మరేం ఫర్లేదంటూ దగ్గర్లోని మెట్రో రైల్ స్టేషన్ కు వెళ్లింది. పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. రాణి మాదిరి ఆమె నడుస్తుంటే.. అసలేం జరిగిందో అర్థం కాక పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తున్న వేళ.. సమయానికి మండపానికి చేరుకోవటానికి మెట్రోను ఆశ్రయించారన్న విషయం తెలిసినంత ఆమెను అభినందించటమే కాదు.. స్మార్ట్ గా ఆలోచిస్తున్నావంటూ అభినందనలు తెలియజేశారు. మరికొందరు ఆమెతో ఫోటోలు దిగారు.
మొత్తంగా ఆమె ఐడియా ఫలించి.. ముహుర్తానికి ముందుగానే పెళ్లి మండపానికి చేరుకుంది. ఈ వైరల్ వీడియోలో మెట్రో ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కిన ద్రశ్యాలతో పాటు.. ఆమె ప్రయాణిస్తున్న వైనం కనిపిస్తుంది. ‘ఆమె ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ అని ఒకరు.. ‘స్మార్ట్ థింకర్’ అని మరొకరు ఇలా పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
This post was last modified on January 28, 2024 2:44 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…