భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు పెళ్లి చేసుకోవడంపై గతంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాయాది దేశం పాక్ జాతీయుడిని సానియా వివాహం చేసుకోవడంపై పలు హిందూ సంఘాలు, పలువురు భారతీయులు మండిపడ్డారు. అయితే, ఈ జంట విడిపోయారని, విడాకులు కూడా తీసుకున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడం సంచలనం రేపింది.
పాకిస్థాన్ నటి సనా జావెద్ ను తాను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అఫీషియల్ గా ప్రకటించాడు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న కొత్త జంట ఫొటోలు చూసి సానియా, షోయబ్ విడాకులు తీసుకున్న సంగతి నిజమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సానియా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుు చూసి చాలామంది వారు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు.
మరోవైపు, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రెండో పెళ్లికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తాజాగా షమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షమీ పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న ఫొటోలు పోస్టు చేసిన వైనం ఆ ప్రచారం నిజమే అనేలా చేస్తోంది. ఆ లుక్ ఏంటి? మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారా? అని నెటిజన్లు ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. అయితే, షమీ మాత్రం ఆ కామెంట్లపై స్పందించలేదు.
గతంలో షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన భార్య హసీన్ జహాన్ విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఆ విడాకుల కేసు కోర్టు విచారణలో ఉంది. మరోవైపు, మోకాలి గాయంతో బాధపడుతున్న షమీ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. 2024 జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ నకు ఫిట్ నెస్ సాధించే పనిలో ఉన్నాడు.
This post was last modified on January 20, 2024 4:02 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…