తనను హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నాయకులు, ఫిలిం సెలబ్రెటీలు, మరికొందరు కలిసి మొత్తం 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కానీ అదంతా అబద్ధమని తేలింది. స్వయంగా ఆ అమ్మాయే ఈ విషయం వెల్లడించింది. తనపై 139 మంది అత్యాచారం జరిపారన్న ఆరోపణ అబద్ధమని.. రాజా శ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే తాను అలా ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.
సోమవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ అమ్మాయి ఈ విషయం వెల్లడించింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ,తెలంగాణప్రదేశ్ ఎరుకల సంఘం,సామాజిక కార్యకర్తలు సంధ్య,సజయలతో కలిసి బాధితురాలు ప్రెస్ మీట్లో మాట్లాడింది.యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు లాంటి కొందరు సెలబ్రెటీలు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తొచ్చాయి. స్వయంగా ఆ అమ్మాయే వాళ్ల పేర్లు వెల్లడించింది. కానీ ఆ ఆరోపణలు తప్పని, ఇది ఫేక్ కేసు అని తేలిపోయింది.
తనకు జరిగిన అన్యాయం వాస్తవమేనని.. కానీ సంబంధం లేని పేర్లను కూడా డాలర్ బాయ్ కేసులో చేర్చాడని ఆమె చెప్పింది. తనను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలకు గురిచేసి అతను బలవంతంగా కేసు పెట్టించాడని అంది. సంబంధం లేని పేర్లను చేర్చడం వల్ల అన్యాయంగా వారు బలైపోతారని తాను ఎంత చెప్పినా రాజా శ్రీకర్ రెడ్డి వినలేదని బాధితురాలు పేర్కొంది.
అతనో సైకో అని… అంతకుముందు అతను హత్య చేసిన అమ్మాయిల శరీర భాగాలను ల్యాప్‌టాప్‌లో చూపించి భయపెట్టాడని చెప్పింది. తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని.. ఫిర్యాదు చేసిన రోజు రాత్రి తనను చచ్చేలా కొట్టాడని… అదే స్థితిలో తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు.ఆ తర్వాత నుంచి ప్రతిదీ తాను చెప్పినట్లే చేయాలని తనను హింసించాడని చెప్పుకొచ్చింది. సంబంధం లేకపోయినా ప్రదీప్,కృష్ణుడు లాంటి సెలబ్రిటీల పేర్లను రాజా శ్రీకర్ రెడ్డే ఫిర్యాదులో చేర్చాడని బాధితురాలు చెప్పింది. తనతో ఏ సంబంధం లేకపోయినా ఈ కేసులోకి లాగిన వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది.
ఏ సమయంలోనూ.. ఎవరితోనూ ఈ కేసుపై చర్చించేందుకు రాజా శ్రీకర్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఏ కాల్ వచ్చినా లౌడ్ స్పీకర్ ఆన్ చేసే మాట్లాడమనేవాడని… ఆఖరికి వాష్‌రూమ్ వెళ్లినా డోర్ బయటే కాపలా కాసేవాడని ఆమె వాపోయింది. అతణ్ని అరెస్టు చేసి తగు చర్యలు చేపట్టాలని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
This post was last modified on August 31, 2020 7:12 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…