భారత చెస్ చరిత్రలో ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన రోజు. మన చదరంగ తారలు మన దేశ చెస్ చరిత్రలోనే అతి పెద్ద విజయన్నందుకున్నారు ఈ రోజు. ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారిగా స్వర్ణం సొంతం చేసుకుంది.
93 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇప్పటిదాకా భారత్ ఒక్కసారి మాత్రమే పతకం గెలిచింది. 2014లో కాంస్యం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా పసడి నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో మన తెలుగు చెస్ తారలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణలది కీలక పాత్ర. వీరితో పాటు విశ్వనాథన్ ఆనంద్, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానానంద, దివ్య దేశ్ ముఖ్, భక్తి కులకర్ణి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.
కరోనా నేపథ్యంలో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్‌ను ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు. ఐతే భారత్‌కు పసిడి నాటకీయ రీతిలో దక్కింది. రష్యాతో ఒక దశలో భారత్ 1.5-2.5తో వెనుకబడింది. కానీ ఆ దశలో చివరి రెండు గేమ్‌లు ఆడుతున్న భారత క్రీడాకారులు ఆధిక్యంలో కనిపించారు. గేమ్‌లు కొనసాగితే వాళ్లే విజేతలుగా నిలిచేవాళ్లు. భారత్‌కు టైటిల్ సొంతమయ్యేది. కానీ ఆ సమయంలో సర్వర్ డౌన్ అయి గేమ్‌లు తేడా అయిపోయాయి. సాంకేతికంగా భారత క్రీడాకారులిద్దరూ ఓడిపోయినట్లు టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు.
దీంతో భారత్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఐతే సాంకేతిక కారణాలతోనే మనవాళ్లు ఓడిపోయినట్లు తేలిందని.. ఇది సమంజసం కాదని మన బృందం మళ్లీ గేమ్‌లు నిర్వహించాలని కోరింది. అలా సాధ్యం కాదని తేల్చిన ఫిడె.. భారత్, రష్యా రెండు జట్లనూ విజేతలుగా ప్రకటించారు. అలా భారత్ నాటకీయ రీతిలో చెస్ ఒలింపియాడ్ విజేతగా నిలిచింది.
This post was last modified on August 31, 2020 9:49 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…