Trends

క‌ప్పు కొట్టారో.. కోట్ల పంట‌లే!!

ప్ర‌పంచ వ‌న్డే క్రికెట్ క‌ప్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన‌ భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్లు గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ లో ఉన్న న‌రేంద్ర మోడీ స్టేడియంలో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ ఫైన‌ల్స్ లో గెలిచే జ‌ట్టుకు.. క‌ప్పుతోపాటు.. కోట్ల‌కు కోట్ల న‌గ‌దు బ‌హుమానంగా ఇవ్వ‌నున్నారు. ఇక‌, ఓడిపోయినా.. ఇంత‌కు కొంత త‌క్కువ‌గా అయినా.. కోట్ల‌కు కోట్ల సొమ్మే ఆ జ‌ట్టుకు కూడా ద‌క్క‌నుంది. ఇది.. బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించిన మొత్తం. ఇది కాకుండా.. ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించే మొత్తాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉన్నాయి.

అదేస‌మ‌యంలో వివిధ పారిశ్రామిక దిగ్గ‌జాలు.. గెలిచే జ‌ట్టుపై కోట్ల‌రూపాయ‌ల క‌న‌క వ‌ర్షం కురిపించేందు కు రెడీ అయ్యారు. ఇక‌, యాడ్ కంపెనీలు కూడా ఇదే రేంజ్‌లో సొమ్మును విర‌జిమ్మ‌నున్నాయి. ఇవ‌న్నీఒక ఎత్త‌యితే.. క‌ప్పును సొంతం చేసుకోవ‌డం ద్వారా ప్ర‌జ‌ల అభిమాన వ‌ర్షంలో జ‌ట్టు త‌ల‌మున‌కలు కానుండ‌డం మ‌రో విశేషం.

గెలిస్తే.. ద‌క్కే సొమ్ము ఎంత‌?

  • ఫైన‌ల్స్‌లో క‌ప్పుకొట్టే జ‌ట్టుకు 40 లక్షల డాలర్లు అంటే.. సుమారు రూ.33.31 కోట్లు అందజేయనున్నారు.
  • ఫైన‌ల్స్‌లో ఓడిపోయి.. రన్నరప్‌గా నిలిచే జ‌ట్టుకు 2 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.16.65 కోట్లు దక్కనున్నాయి.
  • ఇది కాకుంగా.. గెలిచే జ‌ట్టుకు ఆయా దేశాలు(భార‌త్ 30 కోట్లు ప్ర‌క‌టించింది. ఆస్ట్రేలియా 25 కోట్లు ప్ర‌క‌టించింది) కోట్ల వ‌ర్షం కురిపించ‌నున్నాయి.
  • ఇక‌, యాడ్ కంపెనీలు ఇప్ప‌టికే గెలిచే జ‌ట్టుకు 10 కోట్లు, ఓడిపోయిన జ‌ట్టు కు 5 కోట్లు ప్ర‌క‌టించింది.
  • పారిశ్రామిక దిగ్గ‌జం టాటా 15 కోట్లు, మ‌హింద్రా కంపెనీ 10 కోట్లు ప్ర‌క‌టించారు.
  • ఈ ప్ర‌పంచ క‌ప్ మొత్తం ప్రైజుమనీ 10 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.83.29 కోట్లు.
  • లీగ్‌ దశలో ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40,000 డాలర్ల చొప్పున లభిస్తాయి.
  • సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన ఒక్కో జట్టుకు 8 లక్షల డాలర్లను అందజేయనున్నారు. లీగ్‌ స్టేజీలోనే టోర్నీ నుంచి బయటకు వెళ్లిన ఒక్కో జట్టుకు లక్ష డాలర్ల చొప్పున అందిస్తారు.

This post was last modified on November 19, 2023 4:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

9 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

11 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

11 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

12 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

13 hours ago