సాధారణంగా ఏ ఉద్యోగంలో అయినా.. నిర్ణీయ వయసు రాగానే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. అనంతరం.. పింఛను లేదా.. పీఎఫ్ తీసుకుని సదరు ఉద్యోగులు.. ఇంటికే పరిమితం అవుతారు. ఇలానే.. గత 35ఏళ్లుగా దొంగ తనాలు చేస్తూ.. ఎవరి కంటికీ చిక్కకుండా.. ఈ వృత్తితోనే కుటుంబాన్ని పోషిస్తున్న ఓ పెద్దాయన.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. నిజానికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించే వరకు కూడా.. తన కుటుంబానికి తప్ప.. పొరుగింటి వారికి కూడా ‘ఈయన దొంగ’ అనే మాట తెలియదు.
అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే.. 35 ఏళ్ల చోర వృత్తికి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన కుటుంబం పండగ చేసింది. వెంటనే విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది.. జైలుకు తరలించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
ఆద్యంతం ఆసక్తి..
చోరీ వృత్తినే కులవృత్తిగా మార్చుకొని 35 ఏళ్లుగా సుమారు 1000కి పైగా చోరీలకు పాల్పడిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మైలాడుదురై జిల్లా అక్కూరు సిరుపులినాయనార్ వీధిలో ఉంటున్న శంకర్ ఇంట్లో ఏడు రోజుల క్రితం ప్రవేశించిన ఆగంతకుడు 44 సవర్ల నగలు చోరీ చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మీనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. కానీ, ఎంతకీ దొంగ ఆచూకీ చిక్కలేదు.
ఇంతలోనే శేఖర్(60) అనే వ్యక్తి చోరీలకు రిటైర్మెంట్ ప్రకటించాడనే విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో ఆదిశగా పోలీసులు దృష్టి పెట్టారు. శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. శేఖర్ 35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతుండగా, అతనిపై నాగపట్టినం, కారైక్కాల్, మైలాడుదురై, కడలూరు, తిరువారూరు, తంజావూరు సహా పలు జిల్లాల్లో 100కు పైగా చోరీ కేసులున్నట్లు విచారణలో తెలిసింది.
అయితే.. ఏ కేసులోనూ.. ఆయనను పోలీసులు పట్టుకోలేకపోయారట. పట్టుకున్నా.. వెంటనే బెయిల్ వచ్చేసేదట. ఇక, పగటి పూట పలు ప్రాంతాల్లో సంచరించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో చోరీకి పాల్పడుతుంటాడట. మొత్తానికి 35 ఏళ్ల సర్వీసుకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు.. ఇలా ఊచలు లెక్కించాల్సి రావడం.. శేఖర్ ఊహించి ఉండకపోవచ్చని అంటున్నారు పోలీసులు.
This post was last modified on November 18, 2023 2:32 pm
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…