అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్ గండాన్ని దాటింది. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ లీగ్ దశలో ఆధిపత్యం చలాయించి, సెమీఫైనల్లో ఓడిపోవడం.. పైగా 2019లో న్యూజిలాండ్ చేతిలోనే ఓటమి పాలవడంతో.. ఈసారి కంగారు తప్పలేదు. సెంటిమెంట్ రిపీటవుతుందేమో అని అభిమానులు భయపడ్డారు.
నిజానికి కివీస్ ఈ మ్యాచ్‌లో అంత తేలిగ్గా ఏమీ లొంగలేదు. 398 పరుగుల భారీ లక్ష్యం ఉన్నా.. దాన్ని ఛేదించేందుకు గట్టిగా పోరాడింది. మిచెల్, విలియమ్సన్ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారిన సమయంలో భారత అభిమానులకు టెన్షన్ తప్పలేదు. అలాంటి సమయంలో బౌలింగ్‌కు వచ్చి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన బౌలర్ షమి. ఆరంభంలో రెండు వికెట్లు.. చివర్లో ఇంకో మూడు వికెట్లతో మొత్తంగా 7 వికెట్లు తీసి సంచలనం రేపాడు షమి.
మ్యాచ్‌లో కోహ్లి, శ్రేయస్ సెంచరీలు బాదినా.. అసలైన హీరో మాత్రం షమినే. అందుకే నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో షమినే ట్రెండ్ అవుతున్నాడు. ఐతే అదే సమయంలో షమి మాజీ భార్య హసీన్ జహాన్ సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొన్నేళ్ల కిందట వీళ్లిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయి పిల్లలున్న హసీన్‌ను షమి పెళ్లాడాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతో కాలం సవ్యంగా సాగలేదు. హసీన్ తనకు పిల్లలున్న సంగతి చెప్పకుండానే షమిని పెళ్లాడింది. ఆమె ఇంకా మరి కొన్ని మోసాలు చేసినట్లు షమి సన్నిహితులు చెబుతారు. కానీ షమి మీదే వేధింపుల కేసులు పెట్టి అతణ్ని రోడ్డుకీడ్చే ప్రయత్నం చేసింది.
సౌమ్యుడిగా పేరున్న షమి ఈ కేసుల వల్ల కొంత కాలం వేదనకు గురయ్యాడు. కొన్నాళ్లు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పటికీ ఆ కేసులు అతణ్ని వెంటాడుతున్నాయి. కాగా ఆమె మీద ఉన్న కసితోనే షమి.. ప్రపంచకప్‌లో రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. వికెట్లలో తన మాజీ భార్యను చూసుకుంటున్నాడని.. ఎక్కడో కసిని ఇక్కడ చూపిస్తున్నాడని రకరకాల మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడా మీమ్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి.
This post was last modified on November 16, 2023 4:42 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…