తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు…తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులకు ఆ స్థానం దక్కింది. గతంలో గురువు అంటే భయం, భక్తి, గౌరవం ఉండేవి. గురువు, విద్యార్థుల మధ్య సంబంధం కూడా పవిత్రంగా ఉండేంది. కానీ, కలికాలంలో ఆ బంధానికి ఉన్న విలువను కొందరు ఉపాధ్యాయులు మంటగలుపుతున్నారు.
గురుశిష్యుల మధ్య బంధానికి కళంకం తెస్తున్నారు. అభంశుభం తెలియని వయసులో ఉన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే విద్యార్థులకు మాయమాటలు చెప్పి లొంగదీసుకొని తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మన దేశంతో పాటు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో కూడా ఈ కల్చర్ పెరిగింది.
ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో ఓ మహిళా కౌన్సెలర్…4 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనం రేపుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా మిడిల్ స్కూల్ లో గైడెన్స్ కౌన్సెలర్ గా ఉన్న 35 ఏళ్ల కెల్లీ అనే మహిళ అదే పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో అనైతిక సంబంధాన్ని పెట్టుకుంది. బాలుడిని లోబరుచుకొని సెక్స్ చేసింది. అయితే, చివరకు ఓ బంధువు ద్వారా వీరి గుట్టురట్టుకావడంతో పెన్సిల్వేనియా పోలీసులు రంగంలోకి దిగారు.
కెల్లితో సెక్సువల్ రిలేషన్ షిప్ లో ఉన్నానని ఆ బాలుడు తనతో చెప్పాడని సదరు బంధువు అన్నారు. 2022 నుంచి కెల్లీ..ఆ బాలుడిని తరుచుగా ఆఫీసుకు పిలుస్తుండేదని, క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా పిలిచేదని, వీరిద్దరి మధ్య మెసేజులు కూడా నడిచాయని విచారణలో తేలింది. గత ఏడాది జూన్, జూలై నెలల్లో కెల్లీ, తనతో పలుమార్లు లైంగికంగా కలిసినట్లు బాలుడు వెల్లడించాడు. దీంతో కెల్లీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
This post was last modified on November 15, 2023 6:43 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…