విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్న భారతీయ విద్యార్ధులు మొదటి ఆప్షన్ గా అమెరికానే ఎంచుకుంటున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యేయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేయటం కోసం ఏమాత్రం అవకాశం ఉన్న వాళ్ళయినా అమెరికా వెళ్ళటానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖే ప్రకటించింది. అమెరికాలో చదువుకునే విదేశీయ విద్యార్ధుల అవకాశాలపై ఓపెన్ డోర్స్ రిపోర్టు (ఓడీఆర్) తాజా గణాంకాలను విదేశాంగ శాఖ ప్రస్తావించింది.
2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుకోవటానికి వచ్చిన భారతీయ విద్యార్ధులు 35 శాతం పెరిగిందట. ఆల్ టైం రికార్డుగా 2,68,923 మంది భారతీయ విద్యార్ధులు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరిలో కూడా 41 శాతం మంది లెక్కలు, కంప్యూటర్ సైన్స్ చదువుకోవటానికే ఇష్టపడినట్లు చెప్పింది. వివిధ దేశాల నుండి అమెరికాలో చదువుకోవటానికి వచ్చిన విద్యార్ధుల శాతం గతంతో పోల్చితే 12 శాతం పెరిగింది.
2019-21 మధ్య కరోనా వైరస్ కారణంగా అమెరికాకు రావటం ప్రపంచవ్యాప్తంగా మందగించింది. ఇందులో భాగంగానే ఇండియన్ విద్యార్ధుల సంఖ్య కూడా బాగా తగ్గింది. అమెరికాకు వెళ్ళటానికి భారతీయులు భయపడటం లేదా అమెరికా వీసాలు జారీచేయకపోవటంతో అక్కడకు వెళ్ళే విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయింది. దాని ప్రభావమో ఏమో కరోనా ప్రభావం తగ్గగానే ఒక్కసారిగా విద్యార్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఓపెన్ సోర్స్ పద్దతిలో చదువులు, ఉద్యోగాలు, చదువుకుంటూనే పార్ట్ టైమ్ గా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి అమెరికా విశ్వవిద్యాలయాలు. డాలర్ల మోజులు భారతీయ యువత కూడా అమెరికాపై మోజు పెంచుకుంటున్నది.
మనదేశంలో చదువుకోవాలన్నా, ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నా రిజర్వేషన్లు, అనేక రకాల ఒత్తిళ్ళు, ప్రయత్నాలుంటాయని అందరికీ తెలిసిందే. అదే అమెరికాలో అయితే ఇలాంటి గొడవలేమీ ఉండవు. చదువులో మార్కులు, గ్రేడులు మాత్రమే విద్యార్ధి ప్రతిభను నిర్ణయిస్తాయి. దాన్నిబట్టే ఉన్నత చదువులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, పూర్తిస్ధాయి ఉద్యోగాల్లో ఎంపికవుతారు. ఇక్కడ వయసు, అనుభవం అన్నపదాలకు పెద్దగా విలువలేదు. వ్యక్తిని నిర్ణయించేది కేవలం విద్యార్ధి ప్రతిభ మాత్రమే. అందుకనే చిన్నవయసులోనే ప్రొఫెసర్లు కూడా అయిపోతుంటారు. ఇలాంటి అనేక కారణాలతోనే భారతీయ విద్యార్ధులు అమెరికాకు వెళ్ళిపోవటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…