నీ కోసం నా ప్రాణమిస్తా.. అంటూ ప్రియురాలిని మచ్చిక చేసుకునే ప్రేమికులను చూశాం. ఎంత వరకైనా పోరాడి మరీ ప్రియురాలిని సొంతం చేసుకున్న ప్రేమికులను కూడా చూశాం. అదేసమయంలో ప్రేమ పేరుతో ప్రియురాలిని మోసం చేసిన ప్రబుద్ధులను కూడా తరచుగా చూస్తున్నాం. అయితే.. ఇలాంటి ప్రబుద్ధులకు ఎక్కడా అందని రీతిలో ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని దారుణంగా మోసం చేశాడు. నమ్మిన నెచ్చెలిని నిలువునా మోసం చేసి.. ఆమెను బజారున పడేశాడు.
నెటిజన్ల కామెంట్ల కోసం.. వారి ఆనందం కోసం.. తనను నమ్మి మనసుతోపాటు శరీరాన్ని కూడా పంచుకు న్న ప్రియురాలి నగ్న చిత్రాలను ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రేమికుడి ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ ఘటన ఇటు పోలీసులను, అటు సభ్య సమాజాన్ని సైతం నివ్వెర పోయేలా చేసింది.
ఏం జరిగింది?
తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల సంజయ్‌కుమార్, అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చిన్ననాటి నుంచి క్లాస్ మేట్స్ కూడా. చదువు అయిపోయిన తర్వాత.. ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చి.. వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాల్లో చేరారు. ఈ క్రమంలో వారి మధ్య ఉన్న చిన్ననాటి స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఒకే రూంలో ఉంటూ.. ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సహజీవనం చేశారు.
సంజయ్ ప్రేమను నిజయమని భావించిన ఆమె.. తన మనసుతోపాటు మేనును కూడా అతనితో పంచుకుంది. అనేక సందర్భాల్లో ఇద్దరూ సెక్స్‌లో కూడా పాల్గొన్నారు. అయితే.. ఆ సమయంలో సంజయ్.. ఆమె నగ్న చిత్రాలను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. అయితే, అక్కడితో ఊరుకోకుండా.. వీటిని కొంత మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియా వేదికలైన టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు.
ఎలా బయట పడింది?
అయితే, అనుకోకుండా.. తన నగ్న చిత్రాలు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ప్రత్యక్షం కావడంతో ఆ యువతి ఆశ్చర్య పోయింది. ఎవరు ఇలా చేశారంటూ.. నివ్వెర పోయింది. వెంటనే విషయాన్ని సంజయ్‌తో పంచుకుంది. అయితే.. ఈ విషయంలో సంజయ్ చాలా నమ్మకంగా నాటకం ఆడాడు. ఈ విషయం తనకు తెలియదని.. అంతు చూద్దామని .. ఆమెను నమ్మబలికి ఏకంగా.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే.. సైబర్ క్రైమ్ కేసులను ఛేదించడంలో నూతన పంథాలను తొక్కుతున్న బెంగుళూరు పోలీసులు.. అసలు విషయాన్ని అతి తక్కవు టైంలోనే రాబట్టారు.
ప్రియురాలి నగ్న ఫొటోలను సంజయ్ ఓ రహస్య అకౌంట్ నుంచి పోస్టు చేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని నాలుగు పీకి విషయం రాబట్టారు. దీంతో సంజయ్ తాను చేసిన దారుణాన్ని ఒప్పుకొన్నాడు.
‘నా ప్రియురాలు అందంగా ఉంటుంది. ఆమె నగ్న ఫొటోలకు నెటిజన్లు ఎలాంటి కామెంట్లు పెడతారా? అని భావించాను. వాటిని చూసి వారితోపాటునేను కూడా ఆనందించాలని అనుకున్నా. అందుకే అలా చేశా“ అని నిర్లజ్జగా సంజయ్ చెప్పిన స్టేట్‌మెంట్ పోలీసులను సైతం నివ్వెర పరిచింది. ఇలానే స్నేహితులు, బంధువులకు చెందిన వందకు పైగా ఇలాంటి మార్ఫింగ్ చిత్రాలు అతని వద్ద పోలీసులు గుర్తించారు. ఈ చిత్రాల కోసమే బోట్ యాప్ ఎంచుకున్నాడని తెలిపారు. ఇదీ.. సంగతి!
This post was last modified on October 12, 2023 11:21 am
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…