2023 వన్డే ప్రపంచ కప్ నకు మన దేశం ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ ల మధ్య జరగగా… రెండో మ్యాచ్ కోసం నెదర్లాండ్, పాకిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు పాకిస్తాన్ రెడీ అయింది. ఉప్పల్ లో రెండు వామప్ మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడింది. మరోవైపు, నెదర్లాండ్ కు భారత్ లో ఇదే తొలి పర్యటన. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్ జట్టుకు చెందిన తెలుగు తేజం తేజ నిడమనూరు హైదరాబాదీలకు ఒక సందేశం ఇచ్చాడు.
‘హైదరాబాద్ మీకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. మేము ఇవాళ పాక్ తో ఉప్పల్ లో మ్యాచ్ ఆడుతున్నాం. మీరు గ్రౌండ్ కు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము సంతోష పడతాం’ అంటూ తన మాతృభాష తెలుగులో మాట్లాడి ఔరా అనిపించాడు. విజయవాడకు చెందిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్ జట్టులో ఆల్ రౌండర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఉప్పల్ లో జరగబోయే మ్యాచ్ కు తేజ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రజలు తమ మ్యాచ్ చూడాలని ఆహ్వానించాడు.
సన్ రైజర్స్ జట్టు జెర్సీ కూడా ఆరెంజ్ కలర్ లో ఉండడంతో హైదరాబాద్ ప్రజలకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టమని, తమ జెర్సీ రంగు కూడా ఆరెంజ్ అని తేజ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కు వచ్చి తమ జట్టును ఎంకరేజ్ చేయాలని తేజ పిలుపునిచ్చాడు. ఈ మెగా టోర్నీ క్వాలిఫైయర్ మ్యాచ్ లో జింబాబ్వేపై తేజ అద్భుత శతకం సాధించాడు. 110 పరుగులతో అజేయంగా నిలిచి నెదర్లాండ్స్ కు కీలక విజయాన్ని అందించాడు. ఇక, బలమైన పాకిస్తాన్ పై తెలుగు కుర్రాడు తేజ ఏ విధంగా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తన క్యూట్ తెలుగుతో స్వీట్ గా మాట్లాడిన తేజ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on October 6, 2023 6:09 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…