‘పటాస్’ సినిమాలో సీన్ లా ఉందే
లాక్‌డౌన్‌లో అత్యవసరం అయితే తప్ప, బయటికి రావొద్దని ఎంత చెబుతున్నా చాలామంది పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా టైమ్ పాస్ కోసం రోడ్లపై తిరుగుతున్నవారికి బుద్ధి చెప్పేందుకు తమ క్రియేటివిటీ వాడుతున్నారు పోలీసులు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘పటాస్’ మూవీలో ‘801’ అనే అంబులెన్స్ ఒకటి తిరుగుతూ ఉంటుంది. తనకు ఎదురుచెప్పిన వారికి అంబులెన్స్‌లో ఎక్కించి, బుద్ధి చెప్పిస్తూ ఉంటాడు హీరో.
సరిగా ఈ సీన్ వాడుకుని, రోడ్లపైకి వస్తున్న కుర్రాళ్లకు బుద్ధి చెప్పారు తమిళనాడు పోలీసులు. ముఖానికి మాస్క్‌లు కూడా లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తున్న కుర్రాళ్లను ఆపిన తమిళనాడు పోలీసులు, కరోనా పేషెంట్ ఉన్న అంబులెన్స్‌లో ఎక్కించారు. అతని ముట్టుకుంటే తమకు కరోనా వస్తుందనే భయంతో ఆ కుర్రాళ్లు తప్పించుకునేందుకు ఆ వాహనంలోనే గిలగిలా కొట్టుకున్నారు. చూసేవారికి నవ్వులు తెప్పించేలా రూపొందించిన ఈ వీడియో, వారిలా అనవసరంగా బయటికి వచ్చేవారికి గుండెల్లో దడ పుట్టేంచేలా ఉంది.
చివరికి అతను కరోనా పేషెంట్ కాదని పోలీస్ అధికారి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆకతాయిలకు అవగాహన కల్పించేందకు పోలీసులు వాడిన క్రియేటివిటీకి అందరూ ఫిదా అవుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఇలా కారణం లేకుండా బయటికి వచ్చిన వారితో అలిసిపోయేదాకా ఆగకుండా డ్యాన్స్‌లు చేయించారు చెన్నై పోలీసులు.
ఇక తెలంగాణ పోలీసులు కూడా ఈ విషయంలో క్రియేటివ్‌గా ఆలోచించారు. అనవసరంగా బయటికి వచ్చేవారిని ‘నేను ఓ మూర్ఖుడిని. సామాజిక బాధ్యత లేని మూర్ఖుడిని’ అని రాసి ఉన్న బోర్డు దగ్గర సెల్ఫీ తీయించి… సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని ఏరియాల్లో పోలీసులు కరోనాపై అవగాహన కల్పిస్తూ వీడియోలు రూపొందిస్తూ పోలీస్ బృందంతో కలిసి డ్యాన్స్‌లు కూడా చేశారు.
మరికొన్ని ఏరియాల్లో ఎంత చెప్పినా బయటికి వస్తున్నారని కాళ్లపై నిలబడి, దండం పెట్టి అలా వచ్చినవారు సిగ్గు పడేలా చేశారు. ప్రజల క్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రాణాలకి తెగించిన పనిచేస్తున్న పోలీసులు… క్రియేటివిటీలోనూ తక్కువకాదని నిరూపిస్తున్నారు.
This post was last modified on April 25, 2020 12:34 pm
గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటిదాకా నాలుగు పాటలు రిలీజైనా అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్సయ్యిందనే ఫీలింగ్ వాళ్లలో కొంత…
అన్ స్టాపబుల్ సీజన్ 4 మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే…
టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకోవాలన్న ఆశలు తారుమారయ్యాయి. సిడ్నీలో జరిగిన ఐదో టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు…
సాక్ష్యాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి అందులోనూ కోట్లాది అభిమానులున్న పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్టేజి మీద పొగడటం కన్నా ఎవరికైనా…
ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి…
https://youtu.be/fNDRSver0uM?si=FuJxROyuCDfNq7jV వరస బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ సంక్రాంతి పండక్కు డాకు మహారాజ్ గా వస్తున్నారు. కమర్షియల్ అంశాలతోనే ఎప్పుడూ…