ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు దరిమిలా.. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు అప్రకటిత హై అలర్ట్ ప్రకటించింది. దీంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయా యి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేతకు ప్రభుత్వం అప్రకటిత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అన్ని డిపోల్లోనూ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.
దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. విశాఖలో ప్రయాణికులను దించి మరీ బస్సులను సంబంధిత డిపోలకు తరలించారు. అదేసమయంలో ప్రయాణికులకు టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చారు. కొన్ని డిపోల్లో అయితే.. ఈ రోజు ఉదయం నుంచి సిటీ బస్సులు కూడా రోడ్డెక్క లేదు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అన్ని బస్సులను నిలిపివేయగా, విజయవాడలో సిటీ బస్సులు కూడా రోడ్డుపైకి రాకపోవడం గమనార్హం. ఇక, విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. బస్సులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతోనే వాటిని నిలుపుదల చేశామని.. పరిస్థితిని బట్టి వాటిని నడిపే ప్రయత్నం చేస్తామని పోలీసులు తెలిపారు.
This post was last modified on September 9, 2023 10:28 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…