పైత్యం పరాకాష్ఠకు చేరిందన్న దానికి నిదర్శనంగా కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటారు. సందర్భానికి ఏ మాత్రం అతకని రీతిలో చేసే వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించటమే కాదు.. విమర్శలు వెల్లువెత్తేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఉదంతమే మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
ఐశ్వర్యరాయ్ కు ఉన్నట్లు అందమైన కళ్లు సొంతం కావాలంటే రోజు వారీగా తినే ఆహారంలో చేపలు తీసుకోవాలని మహారాష్ట్ర గిరిజన శాఖా మంత్రి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేయటం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నందుర్బార్ జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రోజూ చేపలు తినే వారి చర్మం నునుపుగా ఉండటంతో పాటు.. కళ్లు మెరుస్తాయన్నారు.
“ఎవరైనా మిమ్మల్ని చూస్తే.. ఆ వ్యక్తి మీ ఆకర్షణకు లోనవుతారు. నేను ఐశ్వర్యారాయ్ గురించి చెప్పనా? ఆమె మంగళూరులోని సముద్ర తీరంలో ఉండేవారు. రోజూ చేపలు తినేవారు. మీరు ఆమె కళ్లు చూశారా? చేపలు తింటే అలాంటి కళ్లు మీ సొంతమవుతాయి” అంటూ మహారాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. చేపలు తింటే.. అందమైన కళ్లు వస్తాయన్న లాజిక్ పై ఇప్పుడు పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 22, 2023 11:31 am
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…