తినే తండికి రేషన్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. భగవంతుడ్ని భక్తితో ఆరాధించేందుకు సైతం రేషన్ పెట్టడం దారుణం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో తీసుకొచ్చిన కొత్త నిబంధన గురించి తెలిసినంతనే ఒళ్లు మండిపోతుంది. వసతులు ఏర్పాటు చేయటం కష్టంగా మారితే… కొత్త పరిష్కారాలు వెతకాలి. అంతే కానీ.. భక్తితో వచ్చే వారికి కండీషన్లు పెట్టేసి.. రేషన్ విధించేయటం ఏమిటన్న సందేహం కలుగక మానదు.
అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు రూం తీసుకునే అవకాశం లేకుండా అధికారులు పెట్టిన కండీషన్ చూస్తే.. ఇదేం రూల్ అన్న భావన కలుగక మానదు.
కొండ మీద రూం తీసుకునే వేళ.. భక్తుడి ఆధార్ నంబరును తీసుకొని సిస్టంలో నమోదు చేస్తారు. అలా ఒక ఆధార్ నంబరు మీద రూం తీసుకున్న తర్వాత, మళ్లీ 90 రోజుల వరకు రూం కేటాయించే అవకాశం లేకుండా చూసేలా సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేశారు. దీంతో.. భక్తులు ఒకసారి అన్నవరం వచ్చి రూం తీసుకుంటే.. మళ్లీ మూడు నెలల వరకు గదిని తీసుకునే అవకాశాన్ని కోల్పోతారు.
అంతేకాదు.. భక్తులు గదిని తీసుకునే సమయంలోనూ.. ఖాళీ చేసే సమయంలోనూ వేలిముద్ర ఇవ్వాల్సి ఉంటుంది. వేలిముద్ర నిర్ణయాన్ని వాడారాంటే అర్థం చేసుకోవచ్చు. తప్పుడు మార్గాల్లో రూంలు పొందే వారికి.. బ్లాక్ మార్కెట్ ను కంట్రోల్ చేయటానికి వీలు కలుగుతుంది. దళారి వ్యవస్థకు బ్రేకులు వేయటానికి నిర్ణయాలు తీసుకోవటం బాగానే ఉన్నా.. ఇలా గదుల కేటాయింపునకు కోటా పెట్టటాన్ని భక్తులు జీర్ణించుకోలేని పరిస్థితి. భక్తుల భక్తికి కోటా నిబంధనను పునరాలోచించుకోవాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
This post was last modified on August 7, 2023 11:08 am
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…