వివాహేతర సంబంధం, శారీరక వాంఛ కోసమే.. కట్టుకున్న భర్తను చంపించేసిన ఘటన విశాఖతోపాటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. నేరాలను కట్టడిచేసే పోలీసు కుటుంబంలోనే ఈ దారుణం చోటు చేసుకున్ననేపథ్యంలో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విశాఖపట్నం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేసే రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత దీనిని సాధారణ మరణమే అనుకున్నా.. తర్వాత ఎందుకో అనుమానం వచ్చి.. విచారణ చేపట్టగా గగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశాయి.
ఏం జరిగిందంటే..
కానిస్టేబుల్ రమేష్ భార్య శివజ్యోతి అలియాస్ శివాని. ఈమెకు ట్యాక్సీ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సెక్స్ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని భావించిన శివాని.. ఏకంగా తన భర్త హత్యకు తానే స్కెచ్ సిద్ధం చేసింది. దీని ప్రకారం..
ప్రియుడు, అతని స్నేహితుడు సహయంతో భర్త ను కడతేరేలా చేసింది శివానీ.
ఇంట్లోనే పథకం ప్రకారం తలగడ(దిండు)తో రమేష్‌పై ఒత్తిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అయితే.. అనుమానం రాకుండా.. రమేష్‌కు గుండెనొప్పి గా చిత్రకరించింది భార్య శివ జ్యోతి. ఈ క్రమంలో ఎవరికీ తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా.. అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేయించింది. అయితే.. ఈ విషయం స్టేషన్ కానిస్టేబుళ్లకు తెలిసి.. నివాళులర్పించేందుకు వచ్చారు. అయితే.. మొహంపై కమిలిన గుర్తులు ఉండడంతో అనుమానించి.. ఉన్నతాదికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శివానీ చేసిన పాపాన్ని ఒప్పుకోక తప్పలేదు. కాగా, 2009లో కానిస్టేబుల్ గా విధుల్లోకి వచ్చిన బర్రి రమేష్. వన్ టౌన్ లో పనిచేస్తున్నాడు. ఈయనకు రెండేళ్ల కిందటే వివాహం జరిగినట్టు సమాచారం.
This post was last modified on August 4, 2023 2:48 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…