అలనాటి అందాల తార.. ఒకప్పటి హీరోయిన్ శోభన గుర్తున్నారా? ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించారు. విక్రమ్, రౌడీ అల్లుడు, మువ్వగోపాలుడు, అల్లుడు గారు, త్రిమూర్తులు, రుద్రవీణ, నారీ నారీ నడుమ మురారి, అప్పుల అప్పారావు తదితర చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించారు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మెదలెట్టారు. కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా చెన్నైలోని ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. తేనాంపేట్‌లోని శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తల్లితో కలిసి ఉంటున్నారు శోభన.
తన తల్లికి సపర్యలు చేసేందుకు శోభన ఒక మహిళను పనిలో పెట్టుకున్నారు. కానీ కొన్ని రోజులుగా ఆమె తల్లి దగ్గర ఉన్న డబ్బులు పోతున్నాయి. ఆ ఇంట్లో శోభన, ఆమె తల్లి, పనిమనిషి తప్ప ఇతరులు ఉండే అవకాశం లేదు. అందుకే పనిమనిషిని ఆమె అడగ్గా.. తీయలేదని చెప్పింది. దీంతో పోలీసులను శోభన ఆశ్రయించారు.
పనిమనిషిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే డబ్బులు దొంగతనం చేసినట్లు ఆ పనిమనిషి ఒప్పుకుంది. గత నెల రోజుల నుంచి మొత్తం రూ.41 వేల వరకు చోరీ చేసినట్లు చెప్పింది. పేదరికం కారణంగానే డబ్బు మీద ఆశలో ఇలా చేయాల్సి వచ్చిందని ఆ పనిమనిషి తెలిపింది. తనను పనిలో నుంచి తీసేయొద్దని కూడా శోభనను బతిమిలాడింది. దీంతో తిరిగి ఆమెను పనిలో పెట్టుకున్న శోభన.. ఆ కొట్టేసిన డబ్బులను మాత్రం ఆమె జీవితంలో నుంచి కట్ చేశారు. ప్రముఖ భరత నాట్య కళాకారిణి కూడా అయిన శోభన మంచి మనసుకు అభిమానులు ఫిదా అయ్యారు. దొంగతనం చేశాక కూడా పనిమనిషి మీద దయతో పనిలో కొనసాగించడంతో శోభనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on July 29, 2023 4:22 pm
రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు…
ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను…
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం…
బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్…