పాటలకు అనుగుణంగా డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు.. రీల్స్ చేయడం.. డైలాగ్‌లు చెప్పడం.. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం.. ఇప్పుడు పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా ఇదే ట్రెండు నడుస్తోంది. కానీ ఇలా వీడియోలు తీసి.. యూట్యూట్ సహా సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే ఆ యువతి పాలిట శాపమైంది. ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు పెట్టడం మానట్లేదని ఆగ్రహంతో రగిలిపోయిన ఆ అన్న.. తన సొంత సోదరిని హత్య చేశాడు.
ఈ ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్ తండాలో జరిగింది. 20 ఏళ్ల అజ్మీరా సింధు అలియాస్ సంఘవి మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎం అప్రెంటిస్‌గా పనిచేసేది. ఆమె తండ్రి అజ్మీరా శంకర్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తల్లి అజ్మీరా దేవి కూలి పని చేస్తోంది. ఆమెకు అన్న హరిలాల్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సింధు వీడియోలు చేస్తూ పోస్టు చేసేది. ఏఎన్ఎం నర్సుగా పని చేస్తూ.. యూట్యూబ్ వీడియోలు కూడా చేసేది. కానీ ఇది ఆమె అన్నకు నచ్చలేదు.
వీడియోలు పెడుతుండడంతో ఇంటి పరువు పోతుందని సింధుతో హరిలాల్ కొంత కాలంగా గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఆమె మాత్రం వినలేదు. దీనిపై సోమవారం (24న) రాత్రి మరోసారి ఈ అన్నాచెల్లి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఉగిపోయిన హరిలాల్ ఇంట్లో ఉన్న రోకలి బండతో చెల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను.. మొదట ఇల్లెందు, ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో వరంగల్ ఏంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. రాయి తగిలి చనిపోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులను నమ్మించి మంగళవారం ఉదయం హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ అనుమానంతో గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. హరిలాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
This post was last modified on July 26, 2023 5:08 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…