రాత్రి అన్నం పెట్టలేదని కట్టుకున్న భార్యను చంపాడో ప్రబుద్ధుడు. ప్రస్తుత కాలంలో కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్న మనుషులు చేస్తున్న అమానవీయ ఘటనకు ఇదో నిదర్శనం. జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మి వచ్చిన భార్యను.. ఓ భర్త బండరాయితో మోదీ చంపాడు. అందుకు కారణం కూడా పెద్దదేమీ కాదు. అన్నం పెట్టలేదని గొడవ పెట్టుకుని.. ఆగ్రహంతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని మాతా కా థాన్ ఏరియాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ బెనివాల్ (35), సుమన్‌కు 15 ఏళ్ల క్రిత పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఉంటున్న చిరునామాకు ఏడాది క్రితం మారారు. వీళ్ల సంతానం ప్రస్తుతం హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ దంపతులు మధ్య గొడవ జరిగింది. ఇంటికి ఆలస్యంగా వచ్చాననే కారణంతో అన్నం పెట్టలేదనే ఆగ్రహంతో రమేశ్.. బండ రాయితో భార్య సుమన్ తలపై కొట్టి చంపాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో తన బావకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. అతనేమో జోధ్‌పూర్‌లోని తమ బంధువులకు ఈ విషయాన్ని చేరవేశాడు. ఇది తెలుసుకుని రమేశ్ ఇంటికి వచ్చిన బంధువులు తలుపు తీయాలని ఎంత అడిగినా రమేశ్ తీయలేదు. అలాగే రాత్రంతా ఆ శవం పక్కనే కూర్చున్నాడు. చివరకు ఇంటి యజమాని సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకున్నాక.. రమేష్ తలుపులు తీశాడు.
రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి.. భార్యను చంపేందుకు ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకున్నారు. కలప వ్యాపారం చేసే రమేశ్ రెండు మూడు నెలలకోసారి జోధ్‌పూర్‌లోని ఇంటికి వస్తుంటాడు. మృతి చెందిన సుమన్ రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ (ఆర్ఎల్‌పీ) మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలిగా పని చేశారు. అంతకుముందు పెట్రోల్ బంకులోనూ ఆమె పనిచేశారు.
This post was last modified on July 24, 2023 2:59 pm
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో…
ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే 'పందెం కోళ్లు' గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్…
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందు అందులోంచి రిలీజ్ చేసిన ‘దబిడి దిబిడి’ పాట విషయంలో…
టాలీవుడ్లో క్వాలిటీ సినిమాలు చేస్తూనే మంచి స్పీడ్ కూడా చూపించే హీరోల్లో నేచురల్ స్టార్ నాని పేరు ముందు వరుసలో…
తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ స్థానమేంటో, ఆయన స్థాయేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటి ‘బ్రహ్మా ఆనందం’ సినిమా…