Trends

కైలాసానికి డైరెక్ట్ రోడ్డు

తొందరలోనే కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వమే ఒక రోడ్డును నిర్మిస్తోంది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి రోడ్డు నిర్మాణం పనులు పూర్తయిపోవచ్చని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకసారి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి రాకపోకలు మొదలుపెడితే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అసలింతకీ ఈ రోడ్డుకు ఎందుకింత ప్రాధాన్యత దక్కుతోంది ? భక్తులందరు ఎందుకని ఈ రోడ్డుకోసం ఎదురు చూస్తున్నట్లు ?

ఎందుకంటే కైలాసపర్వతంపైన పరమశివుడు కొలువయ్యుంటారని కోట్లాదిమంది భక్తులు నమ్ముతున్నారు. మానససరోవరం కూడా కైలాసపర్వతంలోనే ఉంది. ఈ కైలాస పర్వతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉంది. సాంకేతికంగా ఈ కైలాసపర్వతంలో కొంత భూభాగం చైనా పరిధిలోకి వస్తుంది. అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించుకోవాలని అనుకునే భక్తులకు చైనా ప్రభుత్వం అనుమతి కూడా అవసరం. భక్తులు కైలాసపర్వతాన్ని దర్శించుకోవటం అన్నది చైనా ప్రభుత్వం దయమీద ఆధారపడుంది. పైగా చైనా భూభాగం మీద నుండి ప్రయాణించటం అత్యంత ప్రమాధకరం.

అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించాలని భక్తులు కుతూహలపడుతున్నా చాలామందికి అనుమతులు దొరకటంలేదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేమిటంటే చైనాతో సంబంధంలేకుండా పూర్తిగా మనదేశంలో నుండి కైలాసానికి వెళ్ళేందుకు ఏర్పాటు చేయాలని. ఏర్పాటు చేయాలంటే సుమారు 160 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి. హిమాలయ పర్వాత ప్రాంతాల్లో ఇంతపెద్ద రోడ్డు నిర్మించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయినా సరే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉండే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫితోర్ గఢ్ జిల్లా నాబిధాంగ్ దగ్గర కేఎస్ వీఎం హాట్స్ నుండి లిపులేఖ్ పాస్ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. లిపులేఖ్ పాస్ నుండి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కైలాసపర్వతం వస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తియపోతే వెంటనే భక్తులను అనుమతించాలని కేంద్రం సిద్ధంగా ఉంది. ఇక ఈ రోడ్డు పూర్తయితే చైనా భూభాగాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు.

This post was last modified on July 23, 2023 10:33 am

Share
Show comments
Published by
satya

Recent Posts

పాలిటిక్స్‌కు అతీతంగా ఉంటా: చిరు

మెగాస్టార్ చిరంజీవి.. రాజ‌కీయాల‌పై త‌న మ‌న‌సులో మాట వెల్ల‌డించారు. పాలిటిక్స్‌కు తాను అతీతంగా ఉంటాన‌ని తేల్చి చెప్పారు. అయితే.. సహజంగానే…

9 mins ago

లగడపాటి రాజగోపాల్ ఎక్కడ ? సర్వే ఎప్పుడు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ ది ప్రత్యేక స్థానం. 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి పోటీ…

1 hour ago

కుమారీ ఆంటీ మద్దతు ఎవరికో తెలుసా ?

కుమారి ఆంటీ. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలోనే కాదు బయట కూడా దాదాపు ఈ పేరు తెలియని వారు…

2 hours ago

అదే .. మా నాన్నకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్

'కొండ'ను పిండి చేస్తాం. చేవెళ్లలో గెలవనివ్వం అని రేవంత్ రెడ్డి అనడం డ్రామా. కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ పీసీసీ చీఫ్…

3 hours ago

ఒక్క నిర్ణయం 5 సినిమాలకు ఇబ్బంది

నిన్న హఠాత్తుగా ప్రకటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్…

4 hours ago

కాంగ్రెస్ లో కల్లోలం రేపిన రాహుల్ సభ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాలు…

4 hours ago