నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ చేయలేదని కాదు కానీ నాని కెరీర్ లో ఇంత మాస్ టచ్ ఉన్న సాంగ్ అరుదు కావడంతో సినీ ప్రియులు షాకవుతున్నారు.
అయితే నాని తన కథల ఎంపికలో అనుసరిస్తున్న విధానం చూస్తుంటే భవిష్యత్తులో ఏ లక్ష్యం వైపు వెళ్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న న్యాచురల్ స్టార్ ఎంసిఏలో పక్కింటి అబ్బాయి, నిన్ను కోరిలో భగ్న ప్రేమికుడు, మజ్నులో లవర్, పిల్ల జమీందార్ లో కాలేజీ స్టూడెంట్ కాదు. ఎలివేషన్ల ట్రెండ్లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న న్యూ స్టార్.
దసరాతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానిలో ఈ మార్పుకు శ్రీకారం చుట్టాడు. దాని ఘనవిజయం నానికి కొత్త ఊపు తెచ్చింది. హిట్ 1, హిట్ 2 తానే నిర్మించినా అందులో వేరే హీరోలు నటించారు. కానీ మాస్ మేకోవర్ కోసం అలాంటి రిస్కులు తాను చేయాలని గుర్తించి హిట్ 3లో కత్తి పట్టుకున్నాడు. వర్కౌట్ అయ్యింది.
అంతకు ముందు సెన్సిబుల్ సినిమాలు తీసే వివేక్ ఆత్రేయ ఒక వయొలెంట్ లైన్ చెబితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సరిపోదా శనివారంతో మరో హిట్టు ఖాతాలో వేసుకున్నాడు. ప్యారడైజ్ పాత్ర చాలా రిస్కుతో కూడుకున్నదే అయినా ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఎవరూ చేయని రెండు జడల క్యారెక్టర్ కు ఓకే చెప్పాడు.
క్రమంగా తన మాస్ బేస్ పెద్ద ఎత్తున బలపర్చుకునే ప్లానింగ్ లో ఉన్న నాని ఇకపై నో స్మూత్, ఎమోషనల్ మూవీస్ అంటున్నాడు. సుజిత్ తో చేస్తున్న బ్లడీ రోమియో కూడా ఫుల్ మసాలా ఉండే గ్యాంగ్ స్టర్ డ్రామా. యానిమేషన్ టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది.
నెక్స్ట్ లైనప్ లో ఎవరు ఉన్నా నానికి చెప్పాల్సింది లార్జర్ దాన్ లైఫ్ సబ్జెక్టులే. కాకపోతే ఏడాదికి మూడు లేదా కనీసం రెండు సినిమాలు రిలీజ్ ఉండేలా చూసుకునే నాని ఇప్పుడు ఒకటే ఇవ్వగలిగే రేంజుకు పెరగడం అభిమానుల్లో సంతోషం, బాధ రెండూ కలిగిస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సుస్థిరం చేసుకోవాలనుకున్నప్పుడు స్పీడ్ గా వెళ్ళకూడదు.
This post was last modified on February 25, 2026 11:19 am
గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…