అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎక్కువగా స్లెడ్జింగ్ కు పాల్పడుతుంటారని, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడుతుంటారని అప్రతిష్ట ఉంది. ఇక, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తో సైమండ్స్ మంకీ గేట్ వివాదం మొదలు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ వరకు ఆసీస్ క్రికెటర్ల వివాదాస్పద శైలి వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే కండక్ట్ పరంగా ఆసీస్ క్రికెటర్లు గాడిన పడుతున్నారనుకుంటున్న తరుణంలో కంగారూలు తాజా వివాదానికి కేంద్ర బిందువయ్యారు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఆసీస్ క్రికెటర్ల ప్రవర్తన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో ను ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఔట్ చేసిన విధానం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా ఆసీస్ క్రికెటర్ల తీరును తప్పుబడుతున్నారు. సాధారణంగా ఇటువంటి వివాదాలు ఆటగాళ్లకు, మాజీ ఆటగాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంటాయి. కానీ, తాజాగా ఈసారి ఆసీస్ ఆటగాళ్ల వివాదం ఇరు దేశ ప్రధానుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
ఆసీస్ క్రికెటర్లు వ్యవహార శైలిపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార ప్రతినిధి విమర్శలు గుప్పించడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తాము ఆస్ట్రేలియా క్రికెటర్లలాగా గెలవాలనుకోవట్లేదని బెన్ స్టోక్ చెప్పాడని, ఆ అభిప్రాయాన్ని బ్రిటన్ ప్రధాని కూడా అంగీకరించారని సునాక్ అధికార ప్రతినిధి అన్నారు. అయితే, ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ అధికారిక నివాసం దగ్గర నిరసన వ్యక్తం చేయాలని సునాక్ భావించడం లేదని ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో, ఆ విమర్శలకు ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ స్పందించారు. ఆసీస్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయని, ఆ విషయంలో తాను గర్వపడుతున్నానని అన్నారు.
This post was last modified on July 5, 2023 11:17 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి ఇక నిధుల కొరత అన్న మాట వినిపించదు. ఎందుకంటే… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ తరహా ఫలితాలు ఆ…
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది.…
ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ…
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…