వెస్టిండీస్….ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన జట్టు… నాలుగు దశాబ్దాల కింద కరీబియన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కరుడుగట్టిన బ్యాట్స్ మెన్లకు సైతం వెన్నులో వణుకు పుట్టేది. బాహుబలిలో కాలకేయుల మాదిరి ఉండే విండీస్ బౌలర్లు విసిరే బౌన్సర్లను తట్టుకోవడానికి ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్లు బాహుబలి మాదిరి త్రిశూల వ్యూహం వేసి ఆడినా ఫలితం ఉండేది కాదు. అయితే, ఇదంతా గతం. కొద్ది సంవత్సరాలుగా కరీబియన్ క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో పేలవంగా ఆడుతూ ఘోరంగా విఫలమవుతుంది.
జట్టులో స్టార్ ఆటగాళ్లకు, మ్యాచ్ విన్నర్లకు కొదవ లేనప్పటికీ ఘోర పరాజయాలను మూటగట్టుకొని ప్రపంచ క్రికెట్లో తన ప్రతిష్టను మసకబార్చుకుంటోంది. ఆర్థిక సంక్షోభం నుంచి కొంత గట్టెక్కినా ఆటలో సంక్షోభం నుంచి మాత్రం ఇంకా గట్టెక్కినట్లు కనపడటం లేదు. త్వరలో జరగబోయే ప్రపంచ కప్ టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించకపోవడం ఇందుకు నిదర్శనం. పసికూన స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైందంటే విండీస్ ఆటతీరు ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
సూపర్ సిక్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓడిపోయిన విండీస్ ఇంటి ముఖం పట్టింది. 50 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు క్వాలిఫై కాకపోవడం ఇదే తొలిసారి. మరోపక్క, ఆటగాళ్లకు చెల్లించే మొత్తాన్ని పెంచాలని గేల్ వంటి క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా విండీస్ క్రికెట్ బోర్డు తమలోని లోపాలను సరిదిద్దుకొని…ఆటగాళ్లపై, ఆర్థిక స్థితిగతులపై ఫోకస్ చేయకుంటే విండీస్ క్రికెట్ భారీ మూల్యం చెల్లించక తప్పదు.
This post was last modified on July 3, 2023 8:00 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…