మలయాళం నటుడు షైన్ టామ్ చాకో మనకు దసరాతో పరిచయమై డెబ్యూతోనే పెద్ద హిట్టుని ఖాతాలో వేసుకున్నాడు. అందులో కీర్తి సురేష్ మీద కామంతో రగిలిపోయే క్యారెక్టర్ లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. వచ్చే వారం రంగబలిలోనూ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అన్నిటి కన్నా పెద్ద బ్రేక్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవరలో విలన్ వేషం దక్కించుకోవడం. సైఫ్ అలీ ఖాన్ దే ప్రధాన పాత్ర అయినప్పటికీ టామ్ కు చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఇక్కడివరకే టామ్ గురించి మనకు తెలుసు.
హఠాత్తుగా షైన్ టామ్ చాకో టాలీవుడ్ ఫ్యాన్స్ వల్ల సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చాడు. స్క్రీన్ మీద ఎలా కనిపించినా ఇతను విపరీతమైన అల్లరి చేసే మనిషి. ఎక్కడ ఉన్న ఎవరు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా తోచింది చేస్తుంటాడు. ఇంటర్వ్యూ ఇస్తూ చొక్కా విప్పేసి దేహ దారుఢ్యం ప్రదర్శిస్తాడు. సెల్ ఫోన్ ఎంత ఇష్టమని అడిగితే లైవ్ లో ఖరీదైన ఐ ఫోన్ ని విసిరి అవతలేస్తాడు. ఇంటర్వెల్ టైంలో దొంగతనంగా గేట్లు దూకేసి థియేటర్ ఆడియన్స్ కి షాక్ ఇస్తాడు. నడిరోడ్డు మీద చిన్నపిల్లాడిగా గెంతులు వేస్తూ ఆనందం పంచుకుంటాడు.
ఇలా ఒకటి రెండు కాదు ఈ వీడియోలన్నీ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. పక్కింట్లో ఉంటే భయపడే లుక్స్ తో బెదరగొట్టే షైన్ టామ్ చాకోలో ఇంత చిలిపి కోణాన్ని చూసి మన జనాలు షాక్ అవుతున్నారు. అంటే సరిగ్గా వాడుకుంటే కామెడీని కూడా పిండుకోవచ్చనే క్లారీటీ వీటి ద్వారా వచ్చేసింది. పన్నెండేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చిన్న ఆర్టిస్టుగా నెట్టుకొచ్చిన ఈ విలక్షణ నటుడు ఇప్పుడు మల్లువుడ్ టాప్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరు. తెలుగులో కూడా వరసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. టాలెంట్ కి సుడి కలిసొస్తే అంతే మరి
This post was last modified on June 29, 2023 11:00 am
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి…
పైన ఫొటోలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి కనిపిస్తున్న బుడ్డోడి పేరు నంద్యాల సిద్ధార్థ్. వయసు 14 ఏళ్లే.…