నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వకపోతే రోగం- అంటారు దివంగత దర్శకుడు జంధ్యాల. హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ఆయన ఆహ్లాదభరిత ఆనందాలను పంచే అనేక సినిమాలను మనకు అందిం చారు. నవ్వకుండా ఉండలేనంత స్థాయికి మనల్ని తీసుకువెళ్లారు. అయితే.. మనకు నవ్వు కొత్తకాదు. కష్టమైనా.. సుఖమైనా.. నవ్వులోనే మన జీవితాలను తెల్లార్చుకుంటున్నాం. మనకు నవ్వుకునేందుకు సమయం.. నవ్వించేందుకు నేతలు… సినిమా నాయకులు.. ఇలా అనేక మంది ఉన్నారు.
మరి ఈ నవ్వుల పాఠశాల ఏంటి? అనే సందేహం రావొచ్చు. అంతేకాదు.. ఎలా నవ్వాలో నేర్పించడం ఏంటనే బుగ్గలు నొక్కుకునే ప్రశ్న కూడా తలపోయొచ్చు.. అక్కడికే వస్తున్నాం. మనలాగా.. అన్ని దేశాలు ఉండవు కదా! జనాభా తక్కువో ఎక్కువో.. కొన్ని దేశాల్లో జనాలకు టైం
ఉండదు. ఇలాంటి వాటిలో అభివృద్ధిలో దూసుకుపోతున్న జపాన్ ఒకటి. ఇక్కడ సంసారం చేసేందుకు కూడా సమయం చాలని పరిస్థితి నెలకొంది. దీంతో కొన్నాళ్ల కిందట ప్రభుత్వం వారానికి నాలుగు రోజులే పనిదినాలు చేసి.. మిగిలిన సమయాన్ని భార్యాభర్తలు ఎంజాయ్ చేయాలని సూచించింది.
అలాంటి దేశంలో ఇక నవ్వించేవారు.. నవ్వాలనుకునేవారు ఉంటారా? పైగా… కరోనా తర్వాత.. ఒకరితో ఒకరికి రిలేషన్ తగ్గిపోయింది. నలుగురు కలిసి కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి తోడు రెండేళ్లకుపైగా మాస్కు ముఖ కవచంగా మారిపోయింది. దీంతో జపాన్ ప్రజలు నవ్వడం మరిచిపోయారు. మరీ ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేవారుపూర్తిగా నవ్వుకు దూరమయ్యారు. కానీ, కార్పొరేట్ కంపెనీల్లో పర్సనల్ మేనేజ్‌మెంట్ విభాగానికి నవ్వు కావాలి. తమ వద్దకు వచ్చే వినియోగదారులు.. సంప్రదించే కస్టమర్లను నవ్వుతూ పలకరించారు.
కానీ, ఉద్యోగులు ఈ నవ్వును మరిచిపోయారు..దీంతో ఇక్కడే ఓ సంస్థ ఉపాధిని వెతుక్కుంది. నవ్వులు నేర్పిస్తాం! నవ్వించి చూపిస్తాం..!! అంటూ.. ప్రకటన ఇచ్చింది. అంతే.. పొలో మంటూ.. జపనీయులు ఈ సంస్థలో చేరుతున్నారు. ఈ క్లాసులకు డిమాండ్ నాలుగు రెట్లు పెరిగింది. ఒక్కో సెషన్కి ఫీజుగా 7,700 యెన్లు (4,549 రూపాయలు) వసూలు చేస్తున్నారు. ‘ప్రజలు నవ్వాల్సిన అవసరం ఉంది’ అని సదరు కంపెనీ పేర్కొంటోంది. అద్దంలో చూస్తూ… నవ్విస్తున్నారు. దీనివల్ల ఉద్యోగాల్లోనూ తమకు మేలు జరుగుతోందని జపాన్ యువత పేర్కొంటోంది. ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. నిజం. సో..ఇదీ సంగతి!!
This post was last modified on June 25, 2023 4:38 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…