Trends

16 వేల గుండె ఆపరేషన్లు చేసి, గుండె పోటు తో మృతి

ఆయ‌న యువ డాక్ట‌ర్‌. ప‌ట్టుమ‌ని నాలుగు ప‌దుల వ‌య‌సు పూర్తిగా నిండ‌నేలేదు. కానీ, ఆయ‌న ఈ దేశానికి ఎంతో మేలు చేశాడు. ఎక్క‌డ నుంచి ఎవ‌రు వ‌చ్చినా.. నాడి ప‌ట్టుకుని గుండె చ‌ప్పుడును లెక్క‌గ‌ట్టేవారు. ఈ క్ర‌మంలో కొన్ని వేల గుండెల చ‌ప్పుళ్లు విని.. ఆగిపోతున్న వాటికి ఊపిరి ఇచ్చి.. చ‌ప్పుడు చేసేలా ప్రాణాలు పోశాడు. కానీ… విధి బ‌లీయం. ఇన్ని వేల మంది గుండెల‌ను ఆగ‌కుండా చేసిన ఆయ‌న యువ డాక్ట‌ర్‌.. త‌న గుండె చ‌ప్పును వినలేక‌పోయాడు. అత్యంత పిన్న వ‌య‌సులో ల‌క్ష‌ల మంది అభిమానుల‌ను సంపాయించుకున్న యువ డాక్ట‌ర్ రాత్రికి రాత్రి ఆక‌స్మిక‌ గుండె పోటుతో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం దేశం మొత్తం ఆయ‌నకు క‌న్నీటి నివాళి అర్పిస్తోంది.

ఎవ‌రు? ఏమిటి?

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రాంతానికి గౌర‌వ్ గాంధీ వ‌య‌సు 41(ఇటీవ‌లే పుట్టిన రోజు చేసుకున్నారు). ఈయ‌న అత్యంత పిన్న వ‌య‌సులోనే దేశంలోనే ప్ర‌ఖ్యాతి చెందిన కార్డియాల‌జిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఈయన కోసం దేశ విదేశాల నుంచి హృద్రోగులు క్యూ క‌డ‌తారంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. కానీ, ఇది నిజం. ఈయ‌న డెయిరీ.. వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు నిండిపోయిందంటే.. ఈయ‌న హ‌స్త‌వాసి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సుమారు 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసి, గుండె జబ్బులపై నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే..విధి విలాసం.. త‌న గుండె చ‌ప్పుడును ఆయ‌న వినిపించుకోలేక పోయారో.. లేక టైం అయిపోయిందో.. రోజూలాగే సోమవారం రాత్రి ఆస్పత్రిలో పని ముగించుకొని ప్యాలెస్‌ రోడ్డులో ఉన్న ఇంటికి ఆయన చేరుకున్నారు. ఇంట్లోవాళ్లతో కలిసి భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించారు. రోజూ ఉదయం ఆరింటికల్లా నిద్ర లేచే డాక్ట‌ర్‌.. మంగళవారం ఉదయం ఆరు దాటినా లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి పిలవగా స్పందించలేదు. అచేత‌న స్తితిలో బెడ్‌పై ప‌డి ఉన్నారు.

వెంటనే కుటుంబ స‌భ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి కార‌ణం.. నిద్ర‌లోనే వ‌చ్చిన గుండె పోటు.. పైగా 40 ఏళ్ల ప్రాయంలోనే అది కూడా గుండెల డాక్ట‌ర్‌నే బ‌లితీసుకున్న వైనంతో దేశ‌మే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈయ‌న‌కు ఎలాంటి అలవాట్లూ లేవు. ఆలివ్ ఆయిల్ వాడ‌తార‌ని కుటుంబం చెప్పింది. మ‌రి విధి విలాసం కాక మ‌రేమిటి!!

This post was last modified on June 8, 2023 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మరో సారి కేటీఆర్ పై రెచ్చిపోయిన కొండా సురేఖ

లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…

7 hours ago

ధనుష్ కోసం నయన్ ఫ్రీ సాంగ్

రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…

9 hours ago

విశ్వసుందరి కిరీటం విక్టోరియాకే.. ఇది మరో చరిత్ర!

ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…

9 hours ago

ఆదివారం కూడా.. కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌వా రేవంత్‌!?

సండే ఈజ్ ఏ హాలీడే కాబ‌ట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్ర‌జ‌లంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజ‌కీయ‌ నాయ‌కులు మాత్రం…

9 hours ago

కేజ్రీవాల్ కు మరో దెబ్బ..

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…

10 hours ago

కీర్తి సురేష్ పెళ్లి.. నిజమేనా?

ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…

10 hours ago