మారుతున్న కాలానికి తగ్గట్లు చోటు చేసుకుంటున్న దారుణ హత్యల వివరాలు తెలిస్తే నోట వెంట మాట రాని పరిస్థితి. బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా ఉంటున్న ఈ దారుణాల వివరాలు తెలిసినంతనే నోట మాట రాలేని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో డెడ్ బాడీని గుర్తించిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.
పెళ్లైన మహిళ ఇద్దరితో వివాహేతర సంబంధాన్ని నెరుపుతూ.. ఒక ప్రియుడి సాయంతో మరో ప్రియుడ్నిచంపేసిన దారుణం వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన పూరణ్ సింగ్ పాతబస్తీ బండ్లగూడ.. పటేల్ నగర్ లో పానీపూరీ బండి నడుపుతుంటాడు. అతను ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు జయాదేవితో లవ్ ఎఫైర్ ఉండేది. ఆ తర్వాత యూపీ నుంచి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఇక్కడే సెటిల్ అయ్యాడు.
కొన్నేళ్ల క్రితం అతడికి హైదరాబాద్ కు చెందిన మమతతో పెళ్లైంది. అదే సమయంలో జయాదేవికి మరొకరితో పెళ్లైంది. వారి కుటుంబం కూడా హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చేసింది. అక్రమంలో పాత పరిచయం మళ్లీ మొదలైంది. దీంతో.. పూరణ్ సింగ్ – జయాదేవి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఇదిలా ఉంటే.. జయాదేవికి చంద్రాయణగుట్టకు చెందిన నజీమ్ తో పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వారి మధ్య రిలేషన్ బలపడటం.. గతంలో తనను ప్రేమించిన పూరణ్ సింగ్ తనను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఉన్న ఆమె.. అతడ్ని అడ్డు తొలగించుకోవాలని భావించింది.
అందుకు నజీమ్ అతని స్నేహితులందరితో కలిసి పూరణ్ సింగ్ ను చంపాలని ప్లాన్ చేశారు. జయాదేవికి పూరణ్ సింగ్ కు పరిచయస్తుడైన సుగుణారాం ఫోన్ చేశాడు. పూరణ్ సింగ్ ను తుక్కుగూడకు రావాలని కోరాడు. దీంతో అక్కడకు వచ్చిన అతన్ని.. పథకంలో భాగంగా ఐదుగురు కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం నజీమ్.. పూరణ్ సింగ్ ను డ్రమ్ములో వేసుకొని సూరం చెరువులో పడేసి పారిపోయాడు. భర్త పూరణ్ సింగ్ కనిపించకపోవటంతో అతని భార్య మమత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గదిలో ఉన్న సామాగ్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన నజీం.. సుగుణారాం రావటం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించటంతో షాకింగ్ నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.
This post was last modified on June 7, 2023 12:33 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…