Trends

రైలు ప్ర‌మాదం.. నివేదిక‌ను ఇచ్చిన‌ట్టే ఇచ్చి దాచేశారుగా!

దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని ప్రాథమిక రిపోర్ట్ తేల్చింది. ఈ మానవతప్పిదం కారణంగానే గూడ్స్ ట్రైన్ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించిందని, 3 రైళ్లు ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం తేల్చిందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు ప్రమాదం జరిగిన లైన్ పాక్షికంగా తుప్పుపట్టి ఉందని నిర్ధారణ అయ్యింది. అయితే.. చేతిరాత‌తో కూడిన ఈ నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఇట్టే బ‌హిర్గ‌తం చేసి.. ఆ వెంట‌నే దాచేయ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది.

నివేదిక‌లో ఏం చెప్పారంటే..

  • హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి పొరపాటున సిగ్నల్ రావడంతో శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో బాలాసోర్‌లోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది.
  • అయితే.. ఈ సిగ్న‌ల్ పొరపాటును గమనించి ఆ వెనువెంటనే సిగ్నల్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పటికే ట్రైన్ లూప్‌ లైన్‌లోకి కోర‌మండ‌ల్‌ ప్రవేశించింది. ఫలితంగా అదే లైన్‌లో ఆగివున్న గూడ్స్‌ రైలుని కోరమండల్ వేగంగా ఢీకొట్టింది. ఈ తీవ్రత ధాటికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 కోచ్‌లు విడిపోయి పక్క లైన్‌లో పడ్డాయి.
  • సరిగ్గా ఇదేసమయంలో ఈ లైన్‌లో వెళ్తున్న బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఉన్న కోచ్‌లను బలంగా ఢీకొట్టింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణమైనట్టు నిశితంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని దర్యాప్తు చేపట్టిన సీనియర్ అధికారులు నిర్ధారించారు.
  • ఈ మేరకు జేఎన్ సుబుదీ, ఆర్‌కే బెనర్జీ, ఆర్‌కే పంజిరా, ఏకే మోహంతులతో కూడిన నలుగురు సభ్యుల బృందం చేతి రాతతో 4 పేజీల రిపోర్టును రైల్వేకి సమర్పించింది. బహనగర్ బజార్ రైల్వే స్టేషన్‌లోని సిగ్నల్ రూమ్ రికార్డులు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని వివరించింది.
  • ఇక రెండు రైళ్లలోనూ స్లీపర్ కోచ్‌‌ల కంటే ఏసీ కోచ్‌లపై ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని రిపోర్ట్ తేల్చింది. మరోవైపు ఇంతటి ఘోరం నేపథ్యంలో ఈ లైన్‌లో రక్షణ కవచ్‌ ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

This post was last modified on June 3, 2023 8:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

36 mins ago

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

2 hours ago

రాజాసింగ్…క‌న‌బ‌డుట‌లేదు!

రాజాసింగ్‌... రాజ‌కీయాల ప‌ట్ల క‌నీస ప‌రిచ‌యం ఉన్న‌వారికి ఎవ‌రికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి  కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు.…

3 hours ago

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…

6 hours ago

నయన్‌పై ధనుష్ ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్

ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…

6 hours ago