ఉత్తరకొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన వేసే శిక్షలు.. తీసుకునే నిర్ణయాలు నిభిడాశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనుషులను స్థాణువులను(బిగదీసుకు పోవడం) చేస్తాయి. ఆయన పాలన తీరే అంత. తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి వచ్చారు. మరి ఈ సారి ఆయన చేసిన నిర్వాకం.. ఏంటంటే.. బైబిల్ పట్టుకుందని పసిమొగ్గకు జీవిత ఖైదు విధించడమే! దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం రగులుతోంది. కిమ్ కనిపిస్తే.. కంటి చూపుతో మసి చేయాలన్నంత కోపంతో క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర కొరియాలో క్రైస్తవులు అత్యంత తీవ్రమైన శిక్షలకు గురవుతున్నారని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక తాజాగా వెల్లడించిం ది. బైబిల్‌తో పట్టుబడినవారికి మరణ శిక్ష, వారి కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధిస్తున్నారని తెలిపింది. పసిబిడ్డలకు కూడా జీవిత ఖైదు విధిస్తున్నట్లు పేర్కొంది. క్రైస్తవులతోపాటు ఇతర మతస్థులు కూడా ఇటువంటి దారుణ శిక్షలకు గురవుతున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియాలో క్రైస్తవులు, ఇతర మతాలవారు దాదాపు 70 వేల మంది జైలు శిక్షను అనుభవిస్తున్నారని పేర్కొంది.
పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, రెండేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్ద బైబిల్ ఉండటంతో, ఆ బాలుడితోపాటు మొత్తం కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధించారు. వీరిని రాజకీయ కారాగార శిబిరంలో ఉంచినట్లు తెలుస్తోంది. మతాచారాలను పాటించేవారిని ఉత్తర కొరియా తీవ్రంగా శిక్షిస్తోంది. బైబిల్ కలిగియున్నవారిపై విరుచుకుపడుతోంది. రాజకీయ కారాగార శిబిరాల్లో శిక్షను అనుభవిస్తున్నవారు చెప్తున్నదాని ప్రకారం ఈ కేంద్రాల్లో శారీరకంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది.
షమనిక్ అడహరెంట్స్, క్రైస్తవులపై మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణం 90 శాతం వరకు ఉత్తర కొరియా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖేనని ఈ నివేదిక తెలిపింది. ఉత్తర కొరియాలో న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కొరియా ఫ్యూచర్ ప్రచురించిన నివేదికను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రస్తావించింది. మతాచారాలను పాటించేవారిపైనా, మతపరమైన వస్తువులను కలిగియున్నవారిపైనా ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రంగా దాడి చేస్తోందని తెలిపింది.
మతానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడినా, మతపరమైన నమ్మకాలను ఒకరితో మరొకరు పంచుకున్నా అణచివేస్తోందని తెలిపింది. మతపరమైన విశ్వాసాలుగలవారిని అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, బలవంతంగా పని చేయించడం, హింసించడం, న్యాయమైన విచారణ జరగకుండా నిరోధించడం, దేశం నుంచి వెళ్లగొట్టడం, జీవించే హక్కును నిరాకరించడం, లైంగిక హింసకు గురిచేయడం జరుగుతున్నట్లు తెలిపింది.
This post was last modified on May 27, 2023 11:52 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…