దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో స్టేషన్లలో నిరూపయోగంగా పడి ఉన్న రైల్వే బోగీలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డులుగా మార్చబోతున్నారు.
ఇందుకోసం ఇప్పటికే కావల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య దాదాపు 900 దాకా ఉంది. శని, ఆది వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని గణాంకాలను చూస్తుంటే అర్థమవుతోంది. దాంతో పెరుగుతున్న కరోనా బాధితుల చికిత్స కోసం బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు రైల్వే సిబ్బంది.
దీనికోసం ప్రతీ క్యాబిన్‌లో ఉండే అదనపు బెర్తులను తొలగించి, ఒకే బెర్తు ఉండేలా చేయడమే కాకుండా నిచ్చెనలు, తదితర అదనపు ఫిట్టింగ్‌లను తొలగిస్తున్నారు. ప్రత్యేక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో బోగీలో దాదాపు 20 మంది దాకా రోగులను పెట్టి, చికిత్స చేసే అవకాశం ఉంటుంది. భారతీయ రైల్వే చేసిన ఈ ఆలోచన బాగున్నప్పటికీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే ఇళ్లల్లోనే ఉంటే, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…